"జై చిరంజీవ" అందుకే ఆడలేదు.. మూవీ ఫ్లాప్ కి అసలు కారణం చెప్పేసిన దర్శకుడు..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అశ్విని దత్ నిర్మాణంలో మొదటగా జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ వచ్చింది. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో చూడాలని ఉంది అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో ఇంద్ర అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా చిరంజీవి హీరోగా అశ్వినీ దత్ నిర్మాణంలో రూపొందిన మూడు సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి.

ఇక అలాంటి సమయంలో చిరంజీవి మరోసారి అశ్విని దత్ బ్యానర్ లో మరో సినిమా చేయాలి అనుకున్నాడు. దానితో అశ్వినీ దత్ అప్పటికే వరస విజాయలతో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ భాస్కర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ మూవీ ప్లాన్ చేశాడు. ఇక ఆ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే ను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశాడు. అంతా సెట్ అయ్యింది. ఈ మూవీ స్టార్ట్ అయింది. చిరంజీవి , అశ్విని దత్ కాంబోలో రూపొందిన నాలుగవ సినిమా కావడం , అప్పటికే వరస విజయాలతో ఉన్న విజయ్ భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడం , ఆ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , మాటలు , స్క్రీన్ ప్లే అందించడంతో ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది.

కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ మూవీ దర్శకుడు విజయ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారి ఈమేజ్ చాలా పెద్దది. మేము ఆయన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడదామని అనుకున్నాం. కానీ సినిమా స్టోరీ లోనే ఎక్కడ తేడా కొట్టింది. అందుకే మేము చిరంజీవి గారికి అద్భుతమైన విజయాన్ని అందించలేకపోయాం అని తాజా ఇంటర్వ్యూలో విజయ్ విజయ్ భాస్కర్ చెప్పకచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: