డార్లింగ్ : విడుదలకు ముందే లాభాలు.. బడ్జెట్.. థియేటర్.. నాన్ థియేటర్ టోటల్ వివరాలు ఇవే..?

Pulgam Srinivas
స్టార్ హీరోలు నటించిన సినిమాలు , అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో విడుదలకు ముందు లాభాల్లోకి రావడం లేదు. ఒకటి , రెండు సినిమాలు విడుదలకు ముందు ప్రేక్షకుల మనసును బాగా దోచుకున్నట్లు అయితే , అలాంటి సినిమాలకు ముందే పెద్ద మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతున్నాయి. అలాంటి సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ తో రూపొందినట్లు అయితే అలాంటి కొన్ని సినిమాలు విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ ను చూస్తున్నాయి. ఇక తాజాగా ఆదా ఆ లిస్టులోకి ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ సినిమా చేరింది.
ఇక ఈ మూవీ ని ఎంత బడ్జెట్ తో రూపొందించారు. ఈ మూవీ కి ఎంత బిజినెస్ జరిగింది. సినిమా విడుదల కాకముందే ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ప్రియదర్శి తాజాగా డార్లింగ్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నబా నటేష్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాను జూలై 19 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఇకపోతే ఈ సినిమాను దాదాపు 8 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ కి నాన్ థియేటర్ హక్కుల ద్వారానే 8 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఖర్చు అయిన బడ్జెట్ మొత్తం నాన్ థియేటర్ హక్కుల ద్వారానే వచ్చేసింది. ఇక ఈ సినిమాకి 7 కోట్ల మేర థియేటర్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇది మొత్తం కూడా ఈ సినిమాకు వచ్చిన లాభం. అలా ఈ మూవీ విడుదలకు ముందే 7 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: