ఆ ధైర్యంతోనే మంచు విష్ణు ముందడుగు వేశాడా.. ప్లాన్ తేడా కొడితే ఇక అంతే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటలలో మంచు విష్ణు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఒకటి , రెండు విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. కొంత కాలం క్రితం ఈయన మోసగాళ్లు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ నటుడు జిన్నా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు కన్నప్ప అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే డిసెంబర్ 6 వ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమా విడుదల కాబోయే నెలలోనే కన్నప్ప మూవీ ని కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ కి పోటీగా వెళితే కన్నప్ప సినిమాకి భారీ డ్యామేజ్ జరుగుతుంది అని చాలా మంది అనుకున్నారు.

కాకపోతే అసలు విషయం ఏమిటి అంటే పుష్ప పార్ట్ 2 మూవీ డిసెంబర్ నెలలో విడుదల కావడం కష్టమే అని , ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యి వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల ఛాన్స్ ఉంది అని వార్తలు రావడంతో కన్నప్ప మూవీ యూనిట్ డిసెంబర్ లో తమ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి పుష్ప మూవీ ఏమైనా పోస్ట్ పోన్ అయితే కన్నప్ప కు కలిసి వస్తుంది. లేదంటే కన్నప్ప సినిమాకు భారీ ఎత్తున డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: