పుష్ప రాజ్ కు పోటీగా కన్నప్ప.. బాక్సాఫీస్ వార్ తప్పదుగా..?

murali krishna
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు అని మేకర్స్ నుండి అప్డేట్ రావడంతో సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం రిలీజ్ పై హీరో విష్ణు మంచు ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు. డిసెంబర్ 2024 న కన్నప్ప రిలీజ్ ఉండనుంది అని అన్నారు.కన్నప్ప భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ పీరియాడిక్ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. ఈ స్టార్స్ గెస్ట్ రోల్స్,ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు సమాచారం.పుష్ప 2 మూవీకి పోటీగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ డేట్ కు సంబంధించి విష్ణు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.సినిమాను ఎంత గొప్పగా నిర్మించా అన్నది కాదు.. దాన్ని ఏ టైమ్  లో రిలీజ్ చేశాము అన్నది గొప్ప అంటారు సినీ పండితులు.అల్లు అర్జున్ సినిమాపై మంచు విష్ణు కు ఎందుకు ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి అనిపిస్తోంది కదూ.

 నిజమే.. ఈ సృష్టిలో ఎక్కడో జరిగేది మరెక్కడో జరిగే దానిపై ప్రభావం చూపిస్తుందని సుకుమార్ అన్నట్టు.. టాలీవుడ్ లో కూడా ఎక్కడో వినిపించేది మరెక్కడో ఎవరికో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మంచు విష్ణు చేస్తున్నది కూడా అదే అంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. పుష్ప 2 ఈ యేడాది రిలీజ్ కాదు, దర్శకుడు, నిర్మాతపై అల్లు అర్జున్ అలిగాడు.. అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కదా. దీంతో చాలామంది ఇది నిజమే అనుకుంటున్నారు. కొందరు అసలు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనుకుంటున్నారు. ఇవన్నీ నిజమే అని మంచు వారబ్బాయి కూడా అనుకున్నట్టున్నాడు. అందుకే పుష్ప 2 రిలీజ్ అయ్యే టైమ్ కు తన కన్నప్ప సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. అంటే ఇప్పటి వరకూ పుష్ప 2 పై వచ్చే న్యూస్ అంతా నిజమే అని అతను ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు.. లేక నిజం కావాలని ఆశిస్తున్నాడా అనేది చెప్పలేం కానీ కన్నప్ప సినిమాను డిసెంబర్ 3వ వారంలో విడుదల చేయబోతున్నట్టు టాక్.
కాకపోతే ఇండస్ట్రీలో కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నది ఏంటంటే.. పుష్ప 2 కాస్త ఆలస్యంగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినా.. ఈ సారి చెప్పిన డేట్ కు రావడం పక్కా అంటున్నారు. మరి అప్పుడు విష్ణు తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటాడా లేక పుష్పరాజ్ తో ఎందుకులే అని తప్పుకుంటాడా అనే డిస్కషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి.మరి ‘పుష్ప 2’ తో ‘కన్నప్ప’ పోటీ పడుతుందా? లేక సింగిల్ డేట్ చూసుకొని బరిలోకి దిగనుందా? అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో విష్ణు తో పాటూ ప్రభాస్, అక్షయ్‌ కుమార్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: