టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అతనే... ఫ్యాన్స్ కొట్టుకోవద్దు?

Suma Kallamadi
భారతదేశంలో భిన్నమైన భాషలో ఉంటాయి కాబట్టి ఇక్కడ విభిన్నమైన సినిమా పరిశ్రమలు కొలువు తీరాయి. సాధారణంగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ రంగం సినిమా పరిశ్రమ ఒక్కటే కనబడుతుంది. అందుకే సినిమాలకు ప్రపంచంలో ఇంకెక్కడ లేని ఆదరణ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సినిమా హీరోలకు ఉన్న ఫాలోయింగ్ మరెక్కడ ఉండదు అనేది నిర్వివాదాంశం. ఓ రకంగా చెప్పాలంటే ఫ్యాన్ బేస్ వలన ఇక్కడ హీరోలు పబ్బం గడుపుకుంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో హీరోలంటే పడి చచ్చే వారు కూడా లేకపోలేదు.
సీనియర్ ఎన్టీఆర్ నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎంతటి ప్రాచుర్యం పొందారు అనేది అందరికీ తెలిసినదే. ఇక నేటి తరం హీరోలలో... పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి వారు అగ్రగామిగా వెలుగొందుతున్నారు. వీరులో ఎవరు ఫ్యాన్ బేస్ వారికి ఉంది. ఈ క్రమంలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప.. అనే నినాదాలు కూడా మనకు వినబడుతూ ఉంటాయి. అయితే తాజా సర్వే ఒకటి టాలీవుడ్ హీరోలలో నెంబర్ వన్ ఎవరు అనేది తేల్చి చెప్పింది.. కాబట్టి ఫ్యాన్స్ దయచేసి ఈ లిస్టును చూసి మానసిక ఆందోళన చెందవద్దు.. డిబేట్లు అసలే పెట్టవద్దు. తాజాగా ఆర్ మ్యాక్స్ స్టార్ ఇండియా మ్యాగజిన్ మన టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూ ఓ సర్వే విడుదల చేయడం జరిగింది.
ఆ సర్వే ప్రకారం టాప్ వన్ ప్లేస్ లో డార్లింగ్ ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించారు. ఇక టాప్ 2 స్థానాన్ని దక్కించుకున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్. అదేవిధంగా టాప్ 3లో మహేష్ బాబు, టాప్ 4లో అల్లు అర్జున్, టాప్ 5 రామ్ చరణ్, టాప్ 6 పవన్ కళ్యాణ్, టాప్ 7 నాని, టాప్ 8 రవితేజ, టాప్ 9 మెగాస్టార్ చిరంజీవి, టాప్ 10లో విజయ్ దేవరకొండ ఉన్నారు. ప్రభాస్ గత కొన్నాళ్లుగా ఫ్యాన్ ఇండియా హీరోగా వెలుగొందుతున్నాడు కాబట్టి టాప్ వన్ ప్లేస్ ని దక్కించుకున్నట్టుగా సర్వే వెల్లడించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పరిమితం అయిపోయారు కాబట్టి... టాప్ ఫైవ్ లో స్థానాన్ని కోల్పోయారని సర్వే వెల్లడించింది. కాబట్టి ఈ లిస్టును చూసి సదరు హీరోల అభిమానులు షాక్ తినవద్దని కూడా అదే సర్వే చెప్పుకు రావడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: