బాలయ్య కల్ట్ క్లాసిక్ మూవీకి 33 ఏళ్లు..

murali krishna
నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో స్పెషల్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో 'ఆదిత్య 369' ది మరీ మరీ స్పెషల్ ప్లేస్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది.టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన 'ఆదిత్య 369'కు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో అద్భుతంగా నటించారు. ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయలు ఆహార్యంలో ఆయన నటన అద్భుతం.అప్పట్లో ఈ సినిమా ప్రభజనంగా మారి సూపర్ కలెక్షన్స్ ను సాధించడమే కాకుండా రికార్డ్స్ను సైతం సొంతం చేసుకుంది. ఇక శ్రీకృష్ణదేవరాయల పాత్రలో బాలయ్య నటన అబ్బో….వార్ణించడానికి మాటలు సరిపోవు.లెజెండరీ డైరక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1991 జూలై18న రిలీజ్ అయ్యింది. అంటే నేటికి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ సినిమా. అదే క్రమంలో అప్పట్లోనే గొప్ప సాంకేతిక విధానంతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది అని సినిమాను చూస్తేనే అర్ధం అయిపోతుంది. సినిమాకు పిసి శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేశారు. ఇంగ్లిష్ రైటర్స్ రాబర్ట్ జెమెకిక్స్, హెచ్.జి వెల్స్ రచించిన టైం మిషిన్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఊర్వశి రౌటేలా  అలాగే బాబీ డియోల్  లాంటి నటుల కలయికలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా చేస్తుండగా దీనిపై సాలిడ్ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా కొంచెం గ్యాప్ తర్వాత రీస్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నారు.ఇక ఈ చిత్రం షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ జూలై 21 నుంచి మొదలు కానుంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: