తమిళనాట 'దేవర'కు భారీ పోటీ.. కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందా..?

murali krishna
రాజమౌళి దర్శకత్వంలో rrr మూవీ చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్న‌ర గ్యాప్ తీసుకుని దేవర రూపంలో రంగంలోకి దిగారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు.ఆర్ఆర్ఆర్ మూవీతో ఒక్కసారిగా గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. దీంతో ఈయనకు సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే  హాలీవుడ్ రేంజ్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు.దేవర సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే ఓ సాంగ్ రాగా మోతెక్కిపోతోంది. అయితే, ఈ సినిమా రిలీజ్ విషయంలో మరోసారి సందిగ్ధత నెలకొంది.

తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఏరియాల వారీగా మొదలైపోయింది. ముందు అనుకున్న అక్టోబర్ 10 కాకుండా రెండు వారాలు ముందే రావడం పట్ల అభిమానులు హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక్కడితో ట్విస్టు అయిపోలేదు.తారక్ తో పోటీ పడేందుకు కార్తీ సిద్ధమంటున్నాడు. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన మెయ్యజగన్ సెప్టెంబర్ 27 రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.అయితే ఏపీ తెలంగాణలో దీని వల్ల దేవరకు ఎలాంటి సమస్య రాదు. కానీ తమిళనాడులో కార్తీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.ఇంతేనా అనుకోకండి. జయం రవి బ్రదర్, కెవిన్ బ్లడీ బెగ్గర్ కూడా అదే డేట్ కోసం చూస్తున్నాయి.. ఇదే జరిగితే అన్ని భాషల్లో మంచి రిలీజ్ దక్కించుకోవాలని చూస్తున్న దేవరకు ముఖ్యంగా తమిళంలో ఇబ్బందులు తప్పవు.ఆరు నూరైనా.. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా టీమ్ ప్రకటించిన డేట్‌కే ఈ సినిమాను విడుదల చేయడానికి సర్వ శక్తుల్నీ ఒడ్డుతున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది.దీని వల్ల తమిళనాడు లో దేవరకు కలెక్షన్స్ తగ్గే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: