చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీకి అంతమంది రచయితలు పని చేసారా..?

murali krishna
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. ‘వైజయంతి మూవీస్’ పతాకం పై సి.అశ్వినీ దత్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990 వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలయ్యే 34 ఏళ్ళు పూర్తి కావస్తోంది.అప్పటి రోజుల్లోనే ఈ చిత్రాన్ని రూ.9 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్ గారు నిర్మిస్తుండడంతో ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న దర్శకనిర్మాతలు ఆయనకు ఫోన్ చేసి హెచ్చరించారట. కానీ ఆయన వెనకడుగు వెయ్యలేదు.తెలుగు సినిమా చరిత్రలో ఓ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిన కొన్ని సినిమా లలో ఒకటిగా నిలిచినా సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ మూవీ గురించి అశ్విని దత్ ఎమన్నారంటే ఇప్పుడంటే దర్శకులే కథలు రాసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు దర్శకులు కేవలం దర్శకత్వం మాత్రమే చూసుకునేవారు. వారి చుట్టూ కొందరు ఆస్థాన రచయితలు ఉండేవారు. ఆయా దర్శకుల ఇమేజ్ ను బట్టి వాళ్లుకథలు సిద్ధం చేసేవారు. అలా చూసుకున్నా ఒక్కో సినిమాకు ఒక్కరు లేదా ఇద్దర రచయితలు మాత్రమే పనిచేస్తారు. బట్ ఒక్క సినిమా కోసం.. ఒకే ఒక్క సినిమా కోసం ఏకంగా 27 మంది రైటర్స్ పనిచేశారు. ఆ సినిమా ఏంటో తెలుసా..? జగదేకవీరుడు అతిలోక సుందరి.

యస్.. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన ఈ మూవీ కోసం ఏకంగా 27 మంది రచయితలు పనిచేశారట. 
ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ స్వయంగా చెప్పడం విశేషం. ఓ రకంగా ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ రికార్డ్. ఒక్క మూవీ కోసం ఇంతమంది రచయితలు పనిచేయడం.. అందరి ఆలోచనను తనదిగా చేసుకుని దర్శకుడు రాఘవేంద్రరావు ఓ మాయాజాలాన్ని సృష్టించడం అనేది ఒక అద్భుతం కాక మరేంటీ.అంటూ వివరించారు.
ఇదిలా ఉంటే నిర్మాత అశ్వినీదత్, రామ్ చరణ్ తో ఎలాగైనా జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ని తెరకెక్కించాలని స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది బిగ్ మిస్టరీగా మారింది. కె.రాఘవేంద్రరావు అప్పట్లో తన మేకింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఈ సారి ఆయన కేవలం దర్శకత్వ పర్యవేక్షణలోనే సినిమా రూపొందే అవకాశం ఉందట.ఇంకా శ్రీదేవి పారేసుకున్న ఉంగరం చిరంజీవి కొడుక్కి దొరికితేనో లేక శ్రీ దేవి కూతురికి దొరికితోనో చూడాలని కోట్లమంది అనుకుంటోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: