కొరటాలకు పొంచి ఉన్న ప్రమాదం... తప్పిందో రికార్డు సృష్టించినట్టే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ఈయనఅనేక సినిమాలను తెరకెక్కించాడు. అందులో అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఇక ఆఖరుగా రాజమౌళి ... రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ కి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. దానితో రాజమౌళి క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది.

ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలలో హీరోలుగా నటించిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన విజయాలు దక్కాయి. అద్భుతమైన క్రేజ్ కూడా దక్కింది. కానీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లో హీరోలుగా నటించిన ఏ హీరోకు కూడా ఆ మూవీ తర్వాత ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం దక్కలేదు. చాలా మంది చాలా సంవత్సరాలు పాటు ఆపజాయాల్లో కోరుకుపోయిన హీరోలు కూడా ఉన్నారు. ఇకపోతే ఆఖరుగా రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో హీరోగా నటించిన రామ్ చరణ్ ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య మూవీలో ఓ చిన్న పాత్రలో నటించాడు.

ఈ మూవీ ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు రాజమౌళి తర్వాతే సినిమాతో అందరూ హీరోలు అపజాయలను ఎదుర్కొన్నారు. దానితో కొరటాల శివకు పెద్ద ప్రమాదం ముందు ఉంది. దేవర సినిమాతో కొరటాల హిట్ కొట్టడం కష్టమే అని చాలా మంది అంటుంటే , మరి కొంత మంది మాత్రం కొరటాల పక్కా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఆ సినిమాతో హిట్ కొట్టడం ఖాయం అని భావిస్తున్నారు. ఒక వేళ కొరటాల కనుక దేవర మూవీతో హిట్ కొట్టినట్లయితే ఇప్పటివరకు రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకు విజయం లేదు. అలా ఎన్టీఆర్ కి విజయం ఇచ్చినట్లయితే కొరటాల శివ ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: