ప్రభాస్ కి 1000 కోట్లను క్రాస్ చేయడం రొటీన్ అయిపోయింది.. అమితాబ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen

'కల్కి 2898 AD' 1000 కోట్లను క్రాస్ చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమాలో ద్రోణాచార్య కుమారుడు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటించిన సంగతి తెలిసిందే. ఆయన కారణంగా హిందీలో ఈ మూవీని చాలామంది తెగ చూశారు. అందుకే అక్కడ బ్లాక్ పాస్టర్ హిట్ అయింది అయితే మూవీ ప్లీజ్ కాకముందు నుంచే బిగ్ బి దీని గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూ వస్తున్నారు తాజాగా ఆయన ప్రభాస్‌కు రూ.1,000 కోట్ల కలెక్షన్స్ రావడం రొటీన్ అంటూ తనదైన శైలిలో  చమత్కరించారు.
సినిమా విజయం గురించి బిగ్ బి మాట్లాడుతూ, 'కల్కి' రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం గురించి చర్చించారు. వైజయంతి ఫిలిమ్స్ షేర్ చేసిన వీడియోలో, అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ చేసిన కృషిని ప్రశంసించారు. నటీనటులు, సిబ్బంది పడిన కష్టాన్ని గుర్తిస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ వీడియో మెసేజ్‌లో మాట్లాడుతూ ఇందులో తాను భాగమైనందుకు గర్వంగా  ఫీల్ అవుతున్నట్లు తెలిపారు.
వీడియోలో అమితాబ్ మాట్లాడుతూ "'కల్కి' సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. సినిమాపై ప్రేమ, అభిమానం, మద్దతు కురిపించిన అందరి మంచి మనసులకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. ఇది వైజయంతి ఫిల్మ్స్ నిర్మాతల కృషికి, వారి నమ్మకానికి నిదర్శనం. ఈ సినిమాపై నమ్మకం ఉంచిన నిర్మాత అశ్విని దత్‌కు, ప్రియంక, స్వప్నలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అలాగే, 'కల్కి'కి అద్భుతంగా దర్శకత్వం అందించిన నాగి (నాగ్ అశ్విన్)కి కూడా నా ధన్యవాదాలు. ఈ సినిమా ద్వారా నేను అగ్ర నటీనటులైన కమల్ హాసన్, ప్రభాస్, దీపిక పదుకొణే, ఇతర నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారికి నా కృతజ్ఞతలు." అని చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''కల్కి' సక్సెస్‌ కోసం ఇన్నాళ్లూ కష్టపడిన సిబ్బందికి, సంగీతం అందించిన సంతోష్‌కి, ఎడిటింగ్‌కి, జార్జ్‌కి, కెమెరా పని చేసిన జార్జ్‌కి, అతని అసిస్టెంట్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు అనుభవిస్తున్నది, ఇది చాలా కామన్, ఎందుకంటే ప్రభాస్ చాలా సినిమాలు రూ.1000 కోట్లు దాటాయి, 1000 క్రోర్స్ దాటడం అతడికి కామన్ రొటీన్ అయిపోయింది." అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: