హిందీలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 సౌత్ మూవీస్ ఇవే.. ఆ ప్లేస్ లో కల్కి..!

Pulgam Srinivas
ఈ మధ్య సౌత్ ఇండియన్ మూవీస్ హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటి వరకు హిందీ వర్షన్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 సౌత్ ఇండియన్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.
బాహుబలి 2 : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రూపొందిన బాహుబలి 2 సినిమా హిందీ ఏరియాలో 51 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసి సౌత్ ఇండియా నుండి హిందీ ఏరియాలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 :  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా హిందీ ఏరియాలో 435.2 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.
ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా హిందీ ఏరియాలో 276.8 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలో నటించగా ... విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలలో నటించారు. దిశా పటాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా హిందీ ఏరియాలో 255.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది.
రోబో 2.O శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా హిందీ ఏరియాలో 189 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: