బాక్సాఫీస్ ని షేక్ చేసిన శంకర్ సినిమాలు.. మళ్లీ కంబ్యాక్ ఇస్తాడా..??

Suma Kallamadi
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో దర్శకుడు శంకర్ సినిమాలు అతిపెద్ద హిట్స్ సాధించాయి. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తీసిన జెంటిల్ మాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, బాయ్స్, అపరిచితుడు, రోబో సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. ఇవి భారతదేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి. ఈ సినిమాలోని కథ, కథనం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ కూడా చేశాయి. అలాంటి సినిమాల ద్వారా యంగ్ హీరోలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు శంకర్. అయితే ఏమైందో ఏమో కానీ రోబో సినిమా తర్వాత ఒక హిట్ కూడా కొట్టలేక శంకర్ బాగా ఇబ్బంది పడుతున్నాడు.
 ప్రతి సినిమాలోని కొత్త కాన్సెప్ట్ ను చూపించడం శంకర్ కి అలవాటు అయితే ఇప్పుడు మాత్రం రోటి రోడ్డ కొట్టుడు సినిమాలకి ఆయన పరిమితమవుతున్నారు. భారతీయుడు 2 సినిమా చూస్తే శంకర్ ఇంకా పాత కాలంలోనే ఉన్నాడనేది మనకు అర్థం అవుతుంది. భారీ బడ్జెట్ తో సినిమాలను తీస్తున్నా అవి కనీసం బ్రేక్ ఈవెన్ సాధించడం లేదు. "ఇది శంకర్ తీసిన సినిమానేనా?" అని ఆయన నుంచి వచ్చే ప్రతి మూవీ చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో శంకర్‌కు మంచి నైపుణ్యం ఉన్న కథ విషయంలో మాత్రం అతడు బాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మంచి రైటర్ ను ఈ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది సలహాలు ఇస్తున్నారు. ఈ డైరెక్టర్ నమ్ముకోవడం వల్ల నిర్మాతలే కాకుండా హీరోలు కూడా బాగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే
శంకర్ రెమ్యునరేషన్ మిగతా సక్సెస్‌సుల్ డైరెక్టర్లకు సమానంగా తీసుకుంటున్నాడు. దీనివల్ల రేపొద్దున అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రాకపోవచ్చు. ఈయన సినిమాలు మంచిగా ఉండటం మాట అటు ఉంచితే బాగా చిరాకు తెప్పిస్తున్నాయి. సినిమా వర్క్ ఔట్ అవుతుందా లేదా అని శంకర్ బేరీజు వేసుకోవాల్సిన అవసరం ముంది. సినిమా తీసేస్తే సరిపోతుంది, ప్రేక్షకులే హిట్ చేస్తారు అనే నిర్లక్ష్యపు ధోరణిలో ఉంటే ఆయనను ఎవరు కాపాడలేరు. రాజమౌళికి పోటీ అవుతాడు అనుకున్న శంకర్ కనీసం ఇన్ డైరెక్టర్స్ కి కూడా పోటీ ఇవ్వలేకపోతున్నాడు. చూడాలి మరి కం బ్యాక్ ఇస్తాడో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: