శంకర్ 2.0: అనవసర ఖర్చులతో ముంచేస్తున్నాడుగా?

Purushottham Vinay

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ 2 మూవీ భారీ అంచనాలతో జులై 12న థియేటర్స్ లోకి వచ్చింది. ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. అసలు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయిన మూవీని మళ్ళీ కెలికి మరీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే నష్టాల కోసం మూవీని భారీ బడ్జెట్ పెట్టి తీశారా అని ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో వచ్చిన రోబో 2.0 అయిన కాస్త బెటర్. కనీసం యావరేజ్ హిట్ అయినా కొట్టి స్వల్ప నష్టాలతో బయటపడింది. ఇక ఇండియన్ 2 బడ్జెట్ 500 కోట్ల వరకు అయిపోవడంతో రికవరీ కోసం దీన్ని రెండు భాగాలుగా చేశారు. ఇండియన్ 2, ఇండియన్ 3 గా శంకర్ కథని చెప్పాలని అనుకున్నారు. అదే ఆయన చేసిన బిగ్గెస్ట్ బ్లెండర్.మార్కెటింగ్ స్ట్రాటజీతోనే పెట్టుబడి మొత్తం రికవరీ చేయాలనే ఉద్దేశ్యంతో కరెక్ట్ గా ఒక్క సినిమాకి సరిపోయే కథని రెండుగా చేసి తప్పు చేశాడు. దీంతో మూవీలో అనవసర ఖర్చు పెట్టి బోరింగ్ సీన్స్ తీసి లెంత్ పెంచడం నిజంగా మూర్ఖత్వం అనే చెప్పాలి.


శంకర్ చేసిన ఈ చెత్త ప్రయోగం పూర్తిగా బెడికొట్టింది. దాంతో ప్రేక్షకుల నుంచి మూవీ తిరస్కరణకి గురైంది. ఒకప్పుడు ఎన్నో సంచలన సినిమాలు తీసిన శంకర్ ఇప్పుడు దారుణాతి దారుణంగా తీస్తున్నారు. ఓన్లీ ట్రైలర్ కట్, పాటలు మినహా అసలు స్టోరీ అంతా గాలికి వదిలేస్తున్నారు. ఇక తెలుగు సినిమాల ప్రొడక్షన్ ఖర్చు ఎప్పుడు కూడా 200 కోట్లు దాటిన దాఖలాలు లేవు. అయితే రెమ్యునరేషన్ లతో కలుపుకొని టాలీవుడ్ సినిమాల ఖర్చు ఎక్కువ కనిపిస్తోంది. అయితే శంకర్ సినిమాల ప్రొడక్షన్ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. రోబో సీక్వెల్ గా వచ్చిన 2.ఓ మూవీకి 500 కోట్ల దాకా ఖర్చు చేశారు. గ్రాండ్ నెస్ కోసం భారీగా ఖర్చుచేసిన ఆడియన్స్ నుంచి యావరేజ్ ఫలితం వచ్చింది. ఇక ఇప్పుడు ఇండియన్ మూవీ సీక్వెల్స్ విషయంలో అదే పొరపాటు జరిగింది. ఖర్చు పెరిగిందని రికవరీ కోసం మొత్తం రెండు భాగాలు చేసేసారు. ఇలా చేయడం వలన చెప్పాల్సిన కథకి కరెక్ట్ గా ఆడియన్స్ కి నేరేట్ చేయడంలో శంకర్ ఫెయిల్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: