మరో తమిళ్ స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ..?

murali krishna
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ” గేమ్ ఛేంజర్ “..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడో మొదలైన దర్శకుడు శంకర్  ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ గా ఉండటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో హీరో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమాలో రాంచరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. తాజాగా శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 రిలీజ్ అయింది.. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. దీనితో ఆ ఎఫెక్ట్ చరణ్ సినిమాపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేసున్నాడు.రాంచరణ్ 16 వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు.ఇదిలా ఉంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రాంచరణ్ ఓ చేయనున్నాడని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.దర్శకుడు వెట్రిమారన్ సినిమాలంటేనే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి .ఆయన సినిమాలలో కథకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.ఆయన సినిమాలో స్టార్స్ అంతగా కనిపించరు కేవలం ఆ పాత్రలే కనిపిస్తాయి.అటువంటి దర్శకుడితో రాంచరణ్ మూవీ చేయనున్నట్లు న్యూస్ బాగా వైరల్ అవుతుంది..అయితే గతంలో ఎన్టీఆర్ తో వెట్రిమారన్ మూవీ చేస్తున్నట్లు తెగ ప్రచారం జరిగింది.కానీ అది వర్క్ అవుట్ కాలేదు.దీనితో రాంచరణ్ తో మూవీ చేసేందుకు సిద్దమైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: