గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకున్న ఇండియన్ 2! హిట్ అయ్యుంటే కథ వేరేగా ఉండేది?

Purushottham Vinay

విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 1996లో తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలన రికార్డులు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ మూవీకి సీక్వెల్ గా దాదాపు 28 యేళ్ల తర్వాత భారతీయుడు 2తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు శంకర్. ఈ మూవీని కేవలం భారతీయుడు బ్రాండ్ తోనే తెరకెక్కించాడు. కథ లేకుండా.. కేవలం భారతీయుడు బ్రాండ్ తో కొన్ని సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్.తను ప్రయాణించే రైలు జీవిత కాలం లేటు అన్నట్టు.. ఏదో 1998 లేదా 2000లో తీయాల్సిన భారతీయుడు 2' మూవీని జీవితం కాలం లేటు అన్నట్టు ఎపుడో ఔట్ డేటెట్ కంటెంట్ తో ఈ మూవీని తాజాగా కమల్ హాసన్ తో తెరకెక్కించాడు దర్శకుడు శంకర్. భారతీయుడు లో కూతురు సెంటిమెంట్ అనే ఎమోషన్ తో ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. కానీ 'భారతీయుడు 2' మూవీలో అలాంటి ఎమోషన్ తో కూడిన సన్నివేశాలు అసలు ఏమి లేవు. ఇన్నేళ్లలో మన దేశంలో ఏమి మారలేదనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేసి తప్పు చేశాడు శంకర్.

సాధారణంగా శంకర్ సినిమాల నుంచి హై ఆక్టెన్ యాక్షన్ సీన్స్ ఇంకా సాటిస్ఫాక్షన్ కలిగించే రివేంజ్ సీన్స్ ని ప్రేక్షకులు ఆశిస్తారు. కథ ఎలా ఉన్న ఈ సీన్స్ ని చూపించడంలో మాత్రం శంకర్ దిట్ట. కానీ ఇండియన్ 2 లో అవి మిస్ అయ్యాయి. అవి కనుక పెట్టుంటే నేడు కథ వేరేగా ఉండేది. తెలిసీ తెలిసి కూడా బోరింగ్ సీన్లు పెట్టడం వల్ల నేడు ఇండియన్ 2 మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది.ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ తో ఈ సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించారు. మరోవైపు ఈ సినిమా తొలి రోజు రూ. 58.10 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2024లో మన దేశంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో టాప్ 3లో నిలవడం విశేషం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.50 కోట్ల షేర్ (రూ. 87.30 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'భారతీయుడు 2' ప్రపంచ వ్యాప్తంగా .. రూ. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర రూ. 129.50 కోట్ల షేర్ రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే అంత రాబట్టడం కష్టమే అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: