బాలయ్య నట ప్రస్థానానికి 50 ఏళ్లు.. భారీ సెలెబ్రేషన్స్ కు రంగం సిద్ధం..!!

murali krishna
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారు. బాలయ్య సినీ ప్రయాణం ఆగస్టు 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. బాలయ్య మొట్టమొదటి సినిమా తాతమ్మ కల 1974 ఆగస్టు 30న విడుదలైంది. గత 50 ఏళ్లుగా నాన్‌స్టాప్‌గా హీరోగా రానిస్తూ తెలుగు చిత్రసీమపై బాలయ్య తనదైన ముద్రవేశారు బాలకృష్ణ.అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా పరంగా అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌గా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే సినీ రంగంలో బాలకృష్ణ నట ప్రస్థానానికి గుర్తు గా గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ కార్యక్రమం లో బాలయ్యతో కలిసి నటించిన స్టార్స్‌తోపాటు టెక్నికల్ టీమ్ అలాగే ప్రొడ్యూసర్స్ సహా అందరినీ సన్మానించాలని నిర్ణయించినట్లు సమాచారం. 

ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా లెవల్లో గెస్ట్‌లను ఆహ్వానిస్తున్నారు. హైదరబాద్‌లో సినీ ఇండస్ట్రీ వున్నందున  అక్కడ భారీ ఈవెంట్ ను ఈవెంట్‌ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.…అలాగే సెప్టెంబర్ 6న అమరావతిలో మరో పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అమరావతిలో పూర్తిగా పొలిటికల్ ఈవెంట్ గా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ ఈవెంట్ కు  ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తోపాటు మొత్తం టి.డి.పి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు అవుతారని సమాచారం..ఈ ఈవెంట్ లో బాలయ్య తన వారసుడి సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఈ విషయం గురించి ఫ్యాన్స్ ను ఊరిస్తూ వస్తున్న బాలయ్య ఆ ఈవెంట్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: