"కల్కి" 17వ రోజు టికెట్ సేల్స్ కి దరిదాపుల్లో కూడా లేని "ఇండియన్ 2" 2వ రోజు సేల్స్..?

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది.

ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ సినిమాపై అద్భుతమైన అంచనాలు ఉండడంతో ఈ మూవీ విడుదల అయిన తర్వాత కల్కి సినిమాకు కలెక్షన్లు భారీగా పడిపోయే అవకాశం ఉంది అని చాలా మంది అంచనా వేశారు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఇండియన్ 2 మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు పర్వాలేదు అనే కలెక్షన్ లు వచ్చిన రెండవ రోజు మాత్రం ఈ మూవీ కి కలెక్షన్లు ధారణంగా పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే నిన్నటితో కల్కి సినిమా 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకోగా , ఇండియన్ 2 మూవీ 2  రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇది  ఇలా ఉంటే రెండో రోజు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఇండియన్ 2 మూవీ కి సంబంధించిన 2 లక్షల 25 వేల టికెట్లు సుమారుగా సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇక 17 వ రోజు కల్కి మూవీ కి ఇండియా వ్యాప్తంగా 3 లక్షల 63 వేల రేంజ్ లో టికెట్లు సేల్స్ అయినట్లు తెలుస్తోంది. ఇలా చూసుకున్నట్లు అయితే ఇండియన్ 2 , కల్కి టికెట్ సేల్స్ మధ్య భారీ గ్యాప్ ఉంది. దానితో ఇండియన్ 2 మూవీ ని కల్కి మూవీ అవలీలగా దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: