ఇక బాలీవుడ్.. సౌత్ వైపు చూడకుంటేనే బెస్ట్.. వరుసగా అలాంటి రిజల్ట్స్..?

MADDIBOINA AJAY KUMAR
సౌత్ ఇండస్ట్రీ క్రేజ్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. వరుసగా అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా వాటిపై మంచి ఆధారాలను చూపిస్తున్నారు. దానితో డిఫరెంట్ స్టోరీలతో రూపొందిన సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే సౌత్ నుండి విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకొని ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను పొందిన సినిమాలను బాలీవుడ్ వారు ఈ మధ్య కాలంలో రీమిక్ చేస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే సౌత్ లో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న సినిమాలు హిందీ ప్రేక్షకులను మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోవడం లేదు.

కొన్ని రోజుల క్రితం నాని హీరోగా గౌతమ్ టిన్ననురి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ని గౌతమ్ హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా జెర్సీ అనే పేరుతో రీమేక్ చేశాడు. ఈ మూవీ హిందీ ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇకపోతే శైలేష్ కొలను , విశ్వక్ సేన్ హీరోగా హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ ని తెలుగులో రూపొందించాడు. ఈ మూవీ కి మంచి కలెక్షన్లు తెలుగులో వచ్చాయి. ఇదే సినిమాను శైలేష్ హిందీలో హిట్ ది ఫస్ట్ కేస్ అనే టైటిల్ తోనే రూపొందించగా ఈ మూవీ హిందీలో మాత్రం బోల్తా కొట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో సురరై పోట్రు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఆకాశమేని హద్దురా అనే పేరుతో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి లో రిలీజ్ అయింది. ఈ మూవీ కి తెలుగు , తమిళ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని సుధా కొంగర అక్షయ్ కుమార్ హీరోగా తమిళ్ లో సర్ఫేరా అనే పేరుతో రీమిక్ చేసింది. ఈ మూవీ జూలై 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి దారుణమైన కలెక్షన్లు మొదటి రోజు వచ్చాయి. ఇలా సౌత్ లో మంచి ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాలు హిందీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: