"దేశముదురు" మూవీ ని రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరో తెలుసా.. చేసుంటే స్టార్ అయ్యేవాడు..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో తీయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో పలనా నటుడు లేదా ఆ నటి ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లు అయితే ఆ సినిమా విడుదల అయిన తర్వాత ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే ఆ సినిమాలు ఎందుకు రిజెక్ట్ చేసామా అని బాధపడుతూ ఉంటారు. అదే సినిమా కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లు అయితే ఆ రోజు ఆ సినిమా రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేసాం అనుకుంటూ ఉంటారు.

ఇకపోతే అల్లు అర్జున్ హీరో గా హన్సిక హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తో అల్లు అర్జున్ కి అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ మూవీ లో హీరో గా మొదటి ఆప్షన్ అల్లు అర్జున్ కాదట. ఒక హీరోకు ఈ మూవీ కథను వినిపించగా ఆయన రిజెక్ట్ చేశాక ఈ అవకాశం అల్లు అర్జున్ కు వచ్చిందట. అసలు ఆ హీరో ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి చేసిన తర్వాత దీనిని ఆ సమయంలో తెలుగులో మంచి గుర్తింపు కలిగిన హీరో అయినటువంటి సుమంత్ కి వినిపించాడట.

ఇక కథ మొత్తం విన్న సుమంత్ కు ఈ మూవీ కథ పెద్దగా నచ్చలేదట. దానితో నేను ఈ మూవీ చేయలేను సార్ అని చెప్పాడట. ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఇదే కథను అల్లు అర్జున్ కు వినిపించాడట. ఇక ఆయనకు మాత్రం ఈ కథ సూపర్ గా నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేద్దాం సార్ అని పూరి జగన్నాథ్ కి చెప్పాడట. దానితో ఇది దేశ ముదురు అనే టైటిల్ తో రూపొందడం , విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. ఇకపోతే ఆ సమయంలో సుమంత్ కనుక ఈ సినిమా చేసి ఉంటే ఆయన క్రేజ్ అద్భుతమైన స్థాయిలో ఉండేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: