బాహుబలి 2 రికార్డులు బ్రేక్ అవ్వడం కష్టమే? ఎందుకంటే?

Purushottham Vinay

బాహుబలి మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ మూవీ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో పార్ట్ 2 మీద రాజమౌళి దేశం నలుమూలల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అందువల్ల బాహుబలి పార్ట్ 1 సక్సెస్ బాహుబలి పార్ట్ 2 మీద భారీ అంచనాలని పెంచింది. దీంతో బాహుబలి 2 సినిమాపై అప్పటికి ఇండియన్ బాక్సాఫీస్ పై భారీ బిజినెస్ అయ్యింది.ఫలితంగా భారీ ఓపెనింగ్స్ ని మూవీ అందుకుంది. ఇక కంటెంట్ పరంగా కూడా బాహుబలి పార్ట్ 1 కి మించి ఉందనే టాక్ తో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది ఈ సినిమా. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ కి అందుకున్న చిత్రంగా బాహుబలి2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే బాహుబలి 2 లాగా ఒక్క kgf 2 తప్ప సీక్వెల్స్ తో పెద్దగా ఎవరూ సక్సెస్ లు అందుకోలేదు. మొదటి సినిమాతో క్రియేట్ అయిన అంచనాలని అందుకోవడంలో చాలా మంది దర్శకులు విఫలం అయ్యారు. 


ఇక మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మొదటి పార్ట్ కొంత పర్వాలేదనే టాక్ క్రియేట్ చేసిన పొన్నియన్ సెల్వన్ 2 మాత్రం భారీ నష్టాలతో డిజాస్టర్ అయ్యింది.తాజాగా శంకర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇండియన్ మూవీ 1996లో రిలీజ్ అయిన అన్ని భాషలలో విడుదల అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది.ఇక అప్పుడే మూవీకి సీక్వెల్ ఉంటుందని శంకర్ క్లైమాక్స్ లో ప్రెజెంట్ చేశారు. అయితే ఏకంగా 28 ఏళ్ళ తర్వాత శంకర్ ఇండియన్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అయితే ఇండియన్ మూవీ సక్సెస్ ట్రాక్ ని ఇండియన్ 2 క్యారీ చేయలేకపోయింది. బాహుబలి 2 రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా తరువాత ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చినా ఇప్పటిదాకా ఈ సినిమా రికార్డులని టచ్ చేయలేకపోయాయి. తాజాగా కల్కి 1000 కోట్లతో ప్రభంజనం సృష్టించిన బాహుబలి 2 1800 కోట్ల వసూళ్ళకి మాత్రం చాలా దూరంలో ఉంది. మరి బాహుబలి 2 రికార్డ్ ని ఏ సినిమా కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: