ప్రభాస్ - హను మూవీకి టైటిల్ ఫిక్స్.. మరి ఇంత క్రేజీగా ఉందేంటి?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అన్నీ కూడా వందల కోట్ల భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతున్న సినిమాలే కావడం గమనార్హం. అయితే మొన్నటి వరకు వరుస పరాజయాలతో డీలా పడిన ప్రభాస్ ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ అనే మూవీతో మళ్లీ పుంజుకున్నాడు. రికార్డులు తిరగరాయడమే లక్ష్యంగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే సలార్ సినిమా సూపర్ హిట్ కాగా.. ఇక ఇటీవల కల్కి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త సెన్సేషన్ గా మారిపోయింది.

 ఇక బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల  సునామీ సృష్టిస్తుంది అని చెప్పాలి. మైథాలజీకి సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ జోడించిన నాగ్ అశ్విన్ తన విజయంతో సినీ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధులు చేయగలిగాడు. ఇక థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులు అందరిని కూడా సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లి అందరిని ఫిదా చేసేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో ఈ సినిమా విడుదలై రోజులు గడుస్తున్న ఇంకా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు మాత్రం దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాల రికార్డులను కూడా కల్కి మూవీ తుడిచి పెట్టేసింది. అయితే ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ - హను రాఘవపూడి తో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా హను రాగవపుడి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కకబోయే సినిమాకి టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఫౌజీ అనే టైటిల్ను ఇక ఈ మూవీకి సిద్ధం చేశారట. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఎంతో పవర్ఫుల్ గా ఉండబోతుందట. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి మూవీ.. గత నెల 27వ తేదీన విడుదలై ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ మార్కు కూడా దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: