"స‌ర్ఫిరా" కలెక్షన్లతో 15 ఏళ్లు వెనక్కు వెళ్లిన అక్షయ్.. మరి ఇంతా దారుణమా..?

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటులలో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి హిందీలో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఎప్పుడూ ఖాళీ లేకుండా సినిమాలలో నటిస్తూ దాదాపు సంవత్సరానికి నాలుగు , ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటాడు. ఇక కొంత కాలం క్రితం వరకు అక్షయ్ కుమార్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటు ఉండేవి.

కానీ గత రెండు , మూడు సంవత్సరాలుగా అక్షయ్ కుమార్ కు మంచి విజయాలు దక్కడం లేదు. ఈయన ఆఖరుగా నటించిన దాదాపు పది సినిమాలలో ఎనిమిది వరకు ప్రేక్షకులను నిరుత్సాహ పరిచాయి. ఇకపోతే తాజాగా అక్షయ్ కుమార్ తమిళంలో సూరారై పోట్రో అనే పేరుతో వచ్చిన సినిమాను హిందీలో సర్ఫేరా అనే పేరుతో రీమిక్ చేశాడు. ఇక ఈ సినిమా తమిళ్ ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ వర్షన్ కి కూడా దర్శకత్వం వహించింది. ఇకపోతే జూలై 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం అత్యంత దారుణంగా వచ్చాయి.

మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 2.40 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇకపోతే అక్షయ్ కి అపజయాలు ఉన్నా కూడా ఈ స్థాయి తక్కువ కలెక్షన్లు ఈ మధ్య కాలంలో ఎప్పుడు రాలేదు. 2009 లో 8×10 తస్వీర్ మూవీ రూ.1.80 కోట్ల ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఈ మూవీ తర్వాత ఇంత తక్కువ కలెక్షన్ లు అక్షయ నటించిన ఈ సినిమాకే వచ్చాయి. అక్షయ్ ఆఖరుగా బడే మియా చోటే మియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా మొదటి రోజు మాత్రం ఏకంగా 16 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: