అంబాని పెళ్ళిలో మహేష్ లుక్స్ కి ఫిదా అవుతున్న బాలీవుడ్?

Purushottham Vinay

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ అందానికి బ్రాండ్ అంబాసిడర్. ప్రస్తుతం మహేష్ లో ఫ్యాన్స్ కి నచ్చే చాలా ఛేంజెస్ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో రిజర్వర్డ్ గా ఉండే మహేష్ బాబు ఇప్పుడెంతో ఎనర్జీని చూపిస్తున్నారు. ముఖ్యంగా  ఫ్యామిలీ ఫంక్షన్లు తప్ప బయట వేడుకల్లో ఎక్కడా కనిపించేవారు.కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా అన్ని ఫంక్షన్స్ కి హాజరవుతున్నారు. బంధు వర్గం, స్నేహితుల ఇళ్లలో వేడుకలు జరుగుతుంటే తన ఫ్యామిలీతో తప్పకుండా హాజరవుతున్నారు.వాళ్లతో బాగా కలిసి పోయి సరదా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు తన కుటుంబానికి సంబంధించిన ఈవెంట్ లో తళుక్కున మెరిసారు. ఆ తర్వాత మళ్లీ నిన్న అంబానీ ఇంట జరిగిన వివాహ వేడుకకు సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితారతో కలిసి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్ళికి హాజరైన నూతన వధువరులను ఆశీర్వదించారు.ఇక ఈ పెళ్లిలో మహేష్ ప్రత్యేకంగా హైలైట్ అయ్యారు. బ్లూ కలర్ ఫైజామా షూట్ లో మహేష్ బాబు ఎంతో మనోహారంగా ముస్తాబయ్యారు. ఆయన లాంగ్ హెయిర్ స్టైల్ డ్రెస్ ని పర్పెక్ట్ గా మ్యాచ్ చేసింది. 

హెయిర్ స్టైల్...శరీర కొలతలకు తగ్గ పర్పెక్ట్ ఔట్ ఫిట్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ఎప్పుడు సింపుల్ గా ఉండే మహేష్ ఇప్పటి దాకా  ఏ ఈవెంట్ కోసం ఇలాంటి దుస్తులు ధరించింది లేదు. ఎలాంటి ఈవెంట్కి వెళ్లినా క్యాజువల్స్ లోనే మహేష్ హాజరయ్యి ఆకట్టుకుంటారు. కానీ అంబానీ ఇంట పెళ్లి కావడంతో ప్రత్యేకంగా డిజైనర్ షూట్ లో మెరిసారు.మహేష్ అందానికి నెటి జనులంతా ఫిదా అవుతున్నారు. ఆయన లుక్స్ ని ఉద్దేశించి ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. జాన్ విక్ ఆఫ్ ఇండియా అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేయగా..మరొకరు గ్రీక్ గాడ్ తో మహేష్ బాబుని పోల్చారు. అలాగే హాలీవుడ్ స్టార్ అంటూ ఇంకొకరు పోస్టులు పెట్టారు. ఇక గాళ్స్ పోస్ట్ లు గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ లుక్స్ కి బాలీవుడ్ స్టార్స్ సైతం ఫిదా అయిపోతున్నారు. 48 ఏళ్ల వయసులో కూడా ఇంత అందంగా ఫిట్ గా ఉన్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారు.ఇక రాజమౌళి సినిమా తర్వాత మహేష్ హాలీవుడ్ రేంజ్ స్టార్ అవ్వడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: