వామ్మో: చేసింది తక్కువ సినిమాలే ఫిల్మ్ ఫేర్లో సాయి పల్లవి నయా రికార్డ్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా పేరుపొందిన సాయి పల్లవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా న్యాచురల్ బ్యూటీగా ఎంతోమంది కుర్రాళ్ల కలల రాణిగా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.. తనకు నచ్చని పాత్ర ఏదైనా ఉంటే కచ్చితంగా నటించిన అంటూ తెగేసి మరి చెప్పేస్తూ ఉంటుంది. అందుకే సాయి పల్లవి నటించిన చిత్రాలు మంచి పాపులారిటీ సంపాదించుకునేలా ఉంటాయి. అయితే సాయి పల్లవి తన 9 ఏళ్ల కెరియర్లో చేసింది కేవలం 19 సినిమాలు అయినా 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకోవడం గమనార్హం.

ఇప్పటివరకు ఆరు ఫిల్మ్ ఫేర్ అందుకున్న కథానాయక దేశంలోనే ఎవరూ లేరట.. పాత తరం కథానాయకలలో సూతం సమర్థ్, సీనియర్ హీరోయిన్ల కాజోల్, ఆలియా భట్ వీరితోపాటు ఇప్పుడు సాయి పల్లవి కూడా ఐదు సార్లు ఫిలిం పేరు అందుకొని టాప్ లిస్టులో ఉన్నది. ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డులలో అందరిని వెనక్కి నెట్టి మరి ఆరో ఫిలింఫేర్ అవార్డుకి ఎంపిక అయింది ఈ ముద్దుగుమ్మ. ఇది నిజంగానే అభిమానులకు ఒక గొప్ప విశేషం అని కూడా చెప్పవచ్చు.

మొదటిసారి ప్రేమమ్ సినిమాతో అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తొలి తెలుగు సినిమా ఫిదా సినిమాతో మరొకటి.. శ్యామ్ సింగరాయ్ సినిమాకు మరొకటి లవ్ స్టోరీ సినిమాకు మరొకటి, గార్గి సినిమాకి గాను ఇలా ఐదు ఫిలింఫేర్ అవార్డులో అందుకుంది సాయి పల్లవి.. 2022 సంవత్సరానికి గాను విరాటపర్వం సినిమాకు బెస్ట్ యాక్టర్స్ గా 6 ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నది. పైగా ఇందులో నాలుగు తెలుగు సినిమాలు కావడం గమనార్హం. ఈ సందర్భంగా సాయి పల్లవి పైన అభిమానుల సైతం ప్రశంశాలు సైతం కురిపిస్తున్నారు.. ఒకవైపు తన డాక్టర్ కోర్స్ ని పూర్తి చేసి సొంతంగా ఒక హాస్పిటల్లో ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే సినిమాలలోకి వచ్చిందని సాయి పల్లవి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇలా ఒకవైపు సినిమాలు మరొకవైపు తన వృత్తిని కొనసాగిస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: