వాస్తవాలను గ్రహించిన కిరణ్ అబ్బవరం !

Seetha Sailaja
టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల మధ్య పోటీ విపరీతంగా ఉండటంతో వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాల సమస్యగా మారింది. అదృష్టం కలిసి వచ్చి ఒక హిట్ తగిలితే ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోవడం మరింత సమస్యగా మారింది. హీరోగా ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకడు.

‘రాజావారు రాణివారు’ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాలతో చిన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఆతరువాత నటించిన ‘సెబాస్టియన్’ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ ‘మీటర్’ ‘రూల్స్ రంజన్’ సినిమాలు ఘోరంగా ఫ్లాప్ కావడంతో అతడి ఇమేజ్ పూర్తిగా దెబ్బ తినడమే కాకుండా అతడితో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు ఆలోచనలలో పడినట్లు తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితులలో ఈ యంగ్ హీరో వాస్తవాలను గ్రహించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన దగ్గరకు సినిమాలు తీస్తాము అని వస్తున్న ప్రతి దర్శకుడుకి ఓకె చెప్పకుండా కథ విషయంలో ఒకటికి  రెండు సార్లు ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాలకు ఒకే చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ‘దిల్ రుబా’ అనే మూవీ ఒకటి.

రెగ్యులర్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా ఈ మూవీలో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈ నెల 15న కిరణ్ పుట్టినరోజున విడుదల చేస్తారని తెలుశవండి. ఈమధ్య ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులను కలిసి తన పై అపనమ్మకం ఏర్పరుచుకున్నవారికి ఈ టీజర్ ను చూపించి మళ్ళీ వారి అభిమానంలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు కిరణ్ ఇటీవలే సీమ నేపథ్యంలో ఒక థ్రిల్లర్ కథను ఓకే చేసినట్లు టాక్. ఇది ఇలా ఉంటే ఈ యంగ్ హీరో ఒక రాయలసీమ ఫ్యాక్షన్ స్టోరీకి కూడ ఓకె చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: