ఈ మిస్టేక్స్ లేకుంటే.. భారతీయుడు -2 రికార్డులు తిరగరాసేదేమో?

praveen
సాధారణంగా ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ మూవీకి సీక్వల్ గా వచ్చే మరో సినిమా కూడా దాదాపుగా హిట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే భారీ అంచనాలు మధ్య విడుదలవుతుంది కాబట్టి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఇలాంటి అంచనాలను తారుమారు చేస్తూ ఉంటాయి అని చెప్పాలి  ఇక ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది అన్నది తెలుస్తుంది.

 1996లో ఇదే కాంబినేషన్లో వచ్చి ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ కొట్టిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య ఇటీవల థియేటర్లలో విడుదలైంది. అయితే యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది అని చెప్పాలి. సాధారణంగానే  శంకర్ మూవీస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ మరో రేంజ్ లో ఉంటాయి. కానీ ఆ అంచనాలను భారతీయుడు 2 అందుకోలేకపోయింది. అయితే ఇలా భారీ అంచనాల మధ్య వచ్చి హిట్ సినిమాకు సీక్వెల్ అయినప్పటికీ ఇక ఫ్లాప్ గానే ఈ మూవీ మిగిలిపోవడానికి కారణం ఏంటి అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ మూవీలో చేసిన కొన్ని తప్పుల కారణంగానే సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణమైందట  

1. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని కాస్త సాగదీయడం అతిపెద్ద మిస్టేక్ అంటున్నారు ప్రేక్షకులు. అంతేకాదు కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఉంటారని ఎంతో మంది ప్రేక్షకులు వస్తే.. ఆమె పాత్రను పూర్తిగా తొలగించి.. పార్ట్ 3 లో ఉంటారని చెప్పడం అభిమానులను నిరాశ పరిచినట్లు అయిందని అనుకుంటున్నారు.
2. భారతీయుడు 3 సినిమా ఉందని చెప్పి ఇక పార్ట్ 2 లో క్యారెక్టర్ లను సరిగ్గా డిజైన్ చేయకపోవడం కూడా మరో అతిపెద్ద మిస్టేక్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ముఖ్యంగా ఎస్ జె సూర్య, బాబి సింహా లాంటి మంచి నటులకు పాత్రల్లో పెద్దగా స్కోప్ లేదు.
3.గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందాన్ని కూడా ఈ మూవీలో  సరిగా వాడుకోవడంలో శంకర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.
4. అయితే ఇండియన్  కి అటు రెహమాన్ మ్యూజిక్ ప్రాణం పోసింది. కానీ ఇప్పుడు ఇండియన్ 2కి మాత్రం రెహమాన్ బిజీగా ఉండడంతో మరో మ్యూజిక్ డైరెక్టర్ స్వరాలు అందించాడు. ఇదే పెద్ద మైనస్ గా మారింది.
5. రెండున్నర గంటలలో ముగించాల్సిన సినిమాను మూడు గంటల వరకు సాగ తీయడం కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టించిందని.. ఇక ఇలాంటి లాజిక్కులు మిస్ కావడం కారణంగా ఈ సినిమా ఫ్లాప్ అయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: