వారానికి మూడు సార్లు మాత్రమే.. ఎక్కువ కుదరడం లేదు.. నెటిజన్ కి అదిరిపోయే రిప్లై ఇచ్చిన అనసూయ..?

MADDIBOINA AJAY KUMAR
అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఓ చానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసింది. దీని ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు ఏమీ రాలేదు. ఆ తర్వాత ఈమె ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించింది. ఇకపోతే టీవీ షో లలో ఈమె తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండడంతో సినిమాలలో కూడా ఈమెకు అవకాశాలు రావడం మొదలు అయింది.

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఓ నెటిజన్ ఈమెను ఒక ప్రశ్న అడగగా ఈమె దానికి అంతే ముక్కు సూటిగా సమాధానం ఇచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో అనసూయ ముచ్చటిస్తున్న సమయంలో ఓ అభిమాని ఈ మధ్య కాలంలో మీరు కాస్త లావు అయినట్లు ఉన్నారు. జిమ్ కి సరిగా వెళ్లడం లేదా అనే ప్రశ్నను అడిగాడు. దీనితో అనసూయ అవును నిజమే ... ప్రస్తుతం అనేక సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. దానితో ప్రతి రోజు జమ్ కి వెళ్లి వర్క్ ఔట్స్ చేయడం కుదరడం లేదు. అందుకే వారానికి మూడు రోజులు మాత్రమే జిమ్ కి వెళ్లి వర్కౌట్లు చేస్తున్నాను అని సమాధానం ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 2 లో కీలక పాత్రలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: