ఆ విషయంలో ఎన్టీఆర్ నే మించిపోయిన మంచు విష్ణు..

murali krishna
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాలలో ఒకటిగా మంచు కుటుంబం కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మోహన్ బాబు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో గా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీ లో లెజండరీ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆయన కుటుంబం నుండి ఇండస్ట్రీ కి వచ్చిన ఇద్దరు కుమారులు కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. మంచు మనోజ్, మంచు విష్ణు కి చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నప్పటికీ కూడా, తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవడంలో ఇద్దరూ విఫలం అయ్యారు. మంచు మనోజ్ సినిమాలను యధావిధిగా కొనసాగించి ఉంటే ఆయన మంచి స్థానం కి వెళ్ళేవాడేమో కానీ, మధ్యలో ఆయన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కొంతకాలం దూరం అవ్వడం తో ఆయనకీ ఉన్న క్రేజ్ మొత్తం పోయింది.ఇప్పుడు మళ్ళీ ఆయన కెరీర్ ని తిరిగి ప్రారంభించాడు, ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యే సెలెబ్రిటీలలో ఒకరు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ మరియు సోషల్ మీడియా వంటి మాధ్యమాలలో ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు. అయితే ఇంస్టాగ్రామ్ లో ఆయన సరికొత్త బెంచ్ మార్క్ ని అధిగమించాడు. సాధారణంగానే సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. అభిమానులతో పాటు మాములు నెటిజన్లు కూడా సెలబ్రిటీలను ఫాలో అవుతారు. 

ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ తో కూడా పాపులారిటీని లెక్కేసుకుంటారు కొంతమంది. అయితే తాజాగా మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ వైరల్ గా మారింది. మంచు విష్ణుని ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 8 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 80 లక్షల మంది ఫాలో అవుతున్నారు.అయితే ఈ విషయంలో మంచు విష్ణు చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోవర్స్ తో ఉన్నాడు. ఎన్టీఆర్ కి ఇన్‌స్టాగ్రామ్ లో 7.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. చిరంజీవికి 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళికి 3.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ డమ్, మార్కెట్ తో పోల్చుకుంటే వీళ్లంతా మంచు విష్ణు కంటే చాలా ఎక్కువే. కానీ మంచు విష్ణుకి ఎక్కువ ఫాలోవర్స్ ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. దీంతో కొంతమంది మంచు విష్ణు ఫాలోవర్స్ పెంచుకోడానికి డబ్బులు ఖర్చుపెట్టాడా? లేక ఎక్కువ యాక్టివ్ గా ఉంటాడని ఫాలోవర్స్ వచ్చారా? లేక మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తుంటారు కాబట్టి ట్రోల్ కంటెంట్ కోసం ఫాలో అవుతున్నారా అని సందేహాలు వస్తున్నాయి. కానీ ఇటీవల రీల్స్ చేసే వాళ్లకి కూడా మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఫాలోవర్స్ కి స్టార్ డమ్ కి సంబంధమే లేదు అని మిగతా హీరోల అభిమానులు అంటుంటే మంచు అభిమానులు మాత్రం మా హీరోకి ఫాలోవర్స్ ఎక్కువ అని పోస్టులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: