బీచ్ ఇసుక‌లో దొర్లుతున్న ముద్దుగుమ్మ!

Suma Kallamadi
స్వీడిష్ బ్యూటీ 'ఎల్లి అవ్రామ్ సీరియ‌స్' గురించి కుర్రకారుకి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎల్లపుడు బిజీగా ఉండే ఈ కుర్రాళ్లకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. ఆమె న‌టిగా కెరీర్‌ను స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో నేటికీ 11 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. బేసిగ్గా స్వీడన్‌ అందాలతార ఇక్కడ మానడం కష్టమే. అయితే ఆమెకి సినిమామీద ఉన్న అకుంఠిత దీక్షే ఆమెకి ఇక్కడ స్థిరపడేలా చేసింది. అయితే కుటుంబానికి దూరంగా ఉండటం తనకు అతిపెద్ద సవాలుగా ఉందని, దానిని జయించేందుకు తాను ఇంకా కష్టపడాల్సి వస్తోందని వాపోతుంది ఎల్లీ బేబీ. మ‌రో వైపు ఎల్లీ సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌కు ఆమె అంత‌ర్జాలంలో మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా ఆమె బికినీ షో అంటే కుర్రకారుకి ప్రత్యేకమైన ఆకర్షణ.
ఈ క్రమంలోనే తాజాగా ఎల్లీ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇసుక‌లో బికినీ సుంద‌రి ఎల్లీ అందాలు కవ్విస్తున్నాయంటూ కుర్రాళ్ళు మెలికలు తిరిగిపోతున్నారు. 2013లో మిక్కీ వైరస్ చిత్రంతో ఎల్లీ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. తర్వాత కిస్ కిస్కో జబరియా జోడి, ప్యార్ కరూన్, మలంగ్, నానే వరువేన్, గణపత్ వంటి భారీ ప్రాజెక్ట్‌లలో నటించి మెప్పించింది. దాపు ద‌శాబ్ధం పైగా కెరీర్ ఇక్కడ కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ మీడియా వేడిఅక్కగా మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో నా ప్రయాణం అద్భుతంగా సాగిపోతుందని వ్యాఖ్యానించింది. అమీర్ ఖాన్ నుండి, సల్మాన్ ఖాన్ వరకు అందరూ తన ఫేవరేట్ హీరోలేనని ఎల్లీ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా నన్ను నమ్మి నటించే అవకాశాలను అందించిన దర్శకనిర్మాతల థాంక్స్ చెప్పుకొచ్చింది.
ఆమె వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు, నేను ర‌క‌ర‌కాల‌ భాషలలో సినిమాలు చేస్తున్నాను. ఈ ప్ర‌యాణం ఎంతో హాయిగా ఉందంటూ తెలిపింది. ఇలా చెప్పుకుంటూ పోతే, కుటుంబానికి దూరంగా ఉండటం ఒక్క‌టే నాకు అతిపెద్ద సవాల్ అని కూడా వాపోయింది ఈ అందాల భామ. ఈ నేపథ్యంలో ఆమె కోరికను కూడా చెప్పుకొచ్చింది... భారతదేశంలో తాను చాలా పెద్ద ఇల్లు కొనాలనుకుంటున్నాను అని, తరువాత తన కుటుంబాన్ని ఇక్కడకు రప్పించాలి.. తద్వారా నేను వారిని జాగ్రత్తగా చూసుకుంటాను. అని చెప్పుకొచ్చింది. త్వరలో ఆమె కోరిక తీరాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: