ఇండియన్-2: కమల్‌ హాసన్ సినిమాకు అవే ప్లస్.. మైనస్‌లు మాత్రం..??

Suma Kallamadi
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నేడు రిలీజ్ అయిన పేట్రియాటిక్ యాక్షన్ డ్రామా భారతీయుడు 2 చాలా బజ్ క్రియేట్ చేస్తోంది. యూఎస్ లో భారతీయుడు 2 మూవీ ప్రీమియర్ సోలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో అక్కడ చూసినవారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా సినిమాలోని ప్లస్‌లు, మైనస్‌ల గురించి మాట్లాడుతున్నారు.1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ దేశంలో పెరిగిపోయిన అవినీతిని హైలెట్ చేస్తూ ఈ సినిమాని తీశాడు. ప్రభుత్వ అధికారులు లంచాల రూపంలో పేదల రక్తం తాగుతుంటారు అలాంటి వారందరినీ చూసి ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు (కమల్ హాసన్) బాగా డిసప్పాయింట్ అవుతారు. ఆయన తిరగబడతారు. అది జీవితంలో ఒక సామాన్యుడు చేయలేనిది ఇందులో చూపించారు కాబట్టి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. భారతీయుడు మూవీలో కమల్ ద్విపాత్రాభినయం చేశాడు. దీనికి సీక్వెల్ గా 2024 జులై 12న భారతీయుడు 2 విడుదల అయింది.
అయితే సినిమా చూసిన వారి ప్రకారం భారతీయుడు 2 ఫస్టాఫ్ చాలా సాధారణంగా ఉంది. ఫస్ట్ సినిమాలో లాగా ఎలాంటి ఎలివేషన్స్ సీన్లు లేవు. మొదటి భాగంలో  సిద్ధార్థ్ దేశంలోని కరప్షన్ పై తన టీమ్ తో కలిసి వీడియోలు రికార్డు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాడు. అలా ఫస్ట్ సన్నివేశాలతోనే నేరుగా కథలోకి తీసుకువెళ్లాడు శంకర్.భారతీయుడు సినిమాలో సేనాపతి (ఓల్డ్ కమల్ హాసన్) అవినీతి అధికారిగా మారిన సొంత కొడుకునే చంపి విదేశాలకు పారిపోతాడు. భారతీయుడు పార్ట్ 2 అక్కడి మంచి ప్రారంభమవుతుంది. విదేశాల నుంచి కమల్ హాసన్ తిరిగి ఇండియాకి వచ్చి మళ్లీ అవినీతిని అరికట్టడానికి సిద్ధమవుతాడు. మూవీ ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తాయి.
కమల్ హాసన్ ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవల్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు కానీ దానికి బదులుగా మూవీ డల్ అయిపోయింది. వృద్దుడిగా కమల్ హాసన్ గెటప్ అసలు బాగో లేకపోవడం పెద్ద మైనస్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదట. అనిరుధ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అంటున్నారు. తెలుగు సాంగ్స్ ఒక్కటి కూడా బాగోలేదు. ఏఆర్ రెహమాన్ సాంగ్స్, మ్యూజిక్ కంపోజ్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుందట. మిగతా ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ అని అంటున్నారు. ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తప్పితే లాంగ్ లెన్త్ డైలాగ్స్, సాగదీత సినిమాకి మైనస్‌లు అయ్యాయట. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ట్విస్ట్ మూవీ హిట్ కావడానికి కారణమవుతాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, ఎస్ జె సూర్య, బాబీ సింహ మంచి పర్ఫామెన్స్ కనబరిచారు. పార్ట్ 1 అంత గొప్పగా లేకపోయినా భారతీయుడు 2 సినిమాని ఒకసారి చూడవచ్చు అనేది ఆడియన్స్ ఫీడ్ బ్యాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: