శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali krishna
తమిళ దర్శక దిగ్గజం శంకర్ మరో భారీ సినిమాకు తెరదీశారు. వెంకటేశన్ రచించిన ‘వేల్పారి’ నవల ఆధారంగా ఓ చారిత్మాక సినిమాను ఆయన తెరకెక్కించనున్నారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో.. మూడు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారని కోలీవుడ్ టాక్.ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌.. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనే సంగతి తెలిసిందే. భారతీయ సినిమాల్లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని ద‌క్కించుకున్న ఈయన.. కమర్షియాల్టికు పెద్ద పీట వేస్తూనే మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాల‌ను అందిస్తూంటారు. దాదాపు ఆయన సినిమాలు అన్నీ  భారీ స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ సక్సెస్ను అందుకున్నాయి.  ప్రస్తుతం కమల్హాసన్తో భారతీయుడు 2 తెరకెక్కించారు. అలాగే  రామ్చరణ్తో ఆర్సీ 15 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత ఆయన ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఆ వివరాలను ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు అన్నారు.  ఈ చిత్రంలో సూర్య లీడ్ రోల్‌ పోషిస్తారని.. కేజీఎఫ్ స్టార్ యష్, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌లు కీలక పాత్రలు పోషిస్తారని ప్రచారం జరుగుతోంది.అయితే ఈ ప్రాజెక్ట్‌లో శంకర్ తొలుత హీరోగా అనుకున్నది ఇళయ దళపతి విజయ్ అని వార్తలు వస్తున్నాయి. కొద్దినెలల క్రితమే ఆయనకు శంకర్ కథను వినిపించగా, దీనికి విజయ్ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. అనంతరం చిత్ర నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్‌కి అప్పగించారు. కానీ అది పట్టాలెక్కలేదు. ఇదే సమయంలో విజయ్ తన ‘‘దళపతి 67’’, ‘‘దళపతి 68’’ సినిమాలకు కమిట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో శంకర్ ప్రాజెక్ట్‌కు డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాడు.తమిళ ఎపిక్‌  గా నవల ‘వెల్పరి’ఇప్పటికే తమిళనాట భారీగా సక్సెస్ అయ్యింది. సు.వెంకటేశన్‌ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. ఈ నవల తమిళ చరిత్ర ఆధారంగా రాయబడ్డది.  

తమిళ ఆనంద వికటన్ పత్రికలో ఈ నవల 100 వారాలు పాటు వచ్చింది. సీరియల్ గా వచ్చేటప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. 2019 లో పుస్తకంగా వచ్చింది. ఈ పుస్తకం కోసం రచయిత చాలా ప్రాంతాలు తిరిగి రీసెర్చ్ చేసారు. ఈ నవల ముఖ్యంగా ఓ ట్రైబల్ రాజు చుట్టూ తిరుగుతుంది. 2000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. పరంబునాడు ప్రాంతాన్ని వేల్పరి పాలించేవాడు. 
అది ఒక కొండ ప్రాంతాలుతో కూడిన రాజ్యం, 300 గ్రామాలు చుట్టూ ఉండేవి. చాలా అందమైన ప్రకృతికే ఈ ప్రాంతానికి ప్రాణం. సంగం యుగంలో ఈ కథ జరుగుతుంది. ఆ సమయంలో   చేర, చోళ , పాండ్య రాజవంశాలు తమిళ ప్రాంతాన్ని పాలించాయి. వాళ్లు ముగ్గురూ కత్తి గట్టి ‘వెల్పరి’రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి దాడి చేస్తారు. ఆ యుద్దం చాలా కాలం పాటు సాగింది. అది ఎలా జరిగింది. ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేసారు. చిన్న రాజు అంత పెద్ద మూడు రాజ్యాల వారిని ఎదిరించి ఎలా నిలబడ్డాడు అనేది అసలు కథ. రూ.1000కోట్ల భారీ బడ్జెట్‌తో  రూపొందించాల్సిన ఈ సినిమాని  కరణ్‌ జోహార్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా, పెన్‌ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ప్రపోజల్ పెట్టారని, వారు ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి ఈ సినిమాలో హీరోగా ఎవరు చేయాలి, ఎవరితో ముందుకు వెళ్లాలనేది శంకర్ ఆలోచనగా చెప్తున్నారు. వీటితో పాటు ర‌ణ్‌వీర్ సింగ్‌ ని ప్రధాన పాత్రలో పెట్టి మిగతా హీరోలను సీన్ లోకి తెచ్చి శంకర్ ఓ టైమ్ లో అనుకున్నారు. కానీ అదీ కార్య రూపం దాల్చలేదు. ఇప్పుడు శంకర్ దృష్టి ప్రభాస్ పైన పడిందని చెప్తున్నారు. కానీ ప్రభాస్ కు ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఇది సాధ్యమయ్యే కాంబినేషన్ కూడా కాదు అంటున్నారు. ఏదైమైనా శంకర్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. త్వరలో భారీ ఎనౌన్సమెంట్ రావచ్చు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం శంకర్‌ దృష్టి మొత్తం రామ్‌చరణ్‌ హీరోగాగా ‘గేమ్ ఛేంజర్’   టైటిల్‌తో  తెరకెక్కుతున్న చిత్రంపైనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: