కిరణ్ అబ్బవరం "క" ఫస్ట్ లుక్ కూడా లేదు అప్పుడే సూపర్ బిజినెస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ఆఖరుగా రూల్స్ రంజన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇకపోతే వరుస సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను పలకరిస్తూ వచ్చిన కిరణ్ అబ్బవరం "రూల్స్ రంజన్" మూవీ తర్వాత మాత్రం ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈయన నుండి ఎన్ని రోజుల పాటు ఎలాంటి సినిమా అప్డేట్ రాలేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈయన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువబడింది. కిరణ్ అబ్బవరం తదుపరి మూవీ "క" అనే డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

ఈ మూవీ కి సుజిత్ , సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ డిఫరెంట్ గా ఉండడం , అలాగే ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన టైటిల్ పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ టీజర్ విడుదల అయిన తర్వాత ఈ మూవీ పై అంచనాలు మరింత పెరుగుతాయి అని , ఈ మూవీ కి భారీ ఎత్తున బిజినెస్ జరిగే రేంజ్ లో ఈ మూవీ యొక్క ప్రచార చిత్రాలు ఉండబోతున్నాయి అని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే కేవలం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ మాత్రమే విడుదల అయింది. దీనితోనే ఈ సినిమాకు మంచి బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క సంగీత హక్కులు తాజాగా అమ్ముడు పోయాయి. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను సరిగమ సంస్థ దక్కించుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ సంస్థ వారు తాజాగా విడుదల చేశారు. ఇలా కేవలం ఒకే ఒక టైటిల్ పోస్టర్ తో ఈ మూవీ పై అంచనాలు భారీగానే పెరిగాయి. మరి ఈ మూవీ నుండి మరికొన్ని ప్రచార చిత్రాలు విడుదల అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: