ప్రియదర్శి క్రేజ్ మామూలుగా లేదుగా.. భారీ ధరకు ప్రముఖ సంస్థ చేతికి డార్లింగ్ తమిళ హక్కులు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమ లో నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రియదర్శి ఒకరు . ఈయన పెళ్లి చూపులు మూవీ తో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఈ నటుడికి సినిమాలలో కమెడియన్ పాత్రలతో పాటు హీరో పాత్రల లో కూడా అవకాశాలు దక్కడం మొదలు అయింది . అందులో భాగంగా ఇప్పటి వరకు ఈయన హీరో గా రూపొందిన మల్లేశం , బలగం మరికొన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి . దానితో ఈయనకు సినిమా లలో హీరో అవకాశాలు భారీగానే పెరుగుతూ వస్తున్నాయి . తాజాగా ఈ నటుడు డార్లింగ్ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు.
 

ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జూలై 19 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ కి మంచి ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ మూవీ యొక్క తమిళ నాడు హక్కులు కూడా అమ్మడు పోయాయి. ఈ మూవీ యొక్క తమిళ నాడు హక్కులను శక్తి ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే రిలీజ్ కి ముందు మాత్రం డార్లింగ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకొని ఈ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: