ఆ విషయంలో "ఆర్ఆర్ఆర్" కి అత్యంత దూరంలో నిలిచిపోయిన "కల్కి"..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , మృణాల్ ఠాకూర్ , శోభన , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

ఇక రెండవ వారం కూడా ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ భారీ కలెక్షన్లనే రెండవ వారం రాబట్టినప్పటికీ ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే మాత్రం ఈ మూవీ అత్యంత దూరంలో నిలిచిపోయింది. రెండవ వారం విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 61.11 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా కల్కి 2898 AD సినిమా మాత్రం 31.75 కోట్ల షేర్ కలక్షన్లను మాత్రమే వసూలు చేసింది.

ఇలా ఈ సినిమా రెండవ వారం విషయంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ కి అత్యంత దూరంలో ఉండిపోయింది. ఇది ఇలా ఉంటే కల్కి 2898 AD సినిమాలో దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కె వి  చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మించింది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: