ధనుష్ రాయన్ పై పెరిగిన అంచనాలు? అందుకేనా?

Purushottham Vinay

తమిళ స్టార్ హీరో నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్ గా తన  మైల్ స్టోన్ మూవీ అయిన 50 వ మూవీకి హీరోగా చేస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.తాజాగా రాయన్ సినిమా సెన్సార్ పూర్తచేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి A సర్టిఫికేట్ ని ఇచ్చింది.హై యాక్షన్ ఎక్కువగా ఉండే ఈ సినిమా రన్‌టైమ్ మొత్తం 2:25 గంటలుగా లాక్ చేశారు. దాదాపు ఇంకో రెండు వారాల్లో ఈ సినిమా విడుదల కానున్నందున మేకర్స్ ప్రమోషన్స్‌లో బాగా దూకుడు పెంచనున్నారు.అపర్ణ బాలమురుగన్, ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, దుషార విజయన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ అయిన AR రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని మొదటి రెండు పాటలు కూడా సూపర్‌హిట్ అయ్యాయి. ఈ సినిమాకి ఓం ప్రకాష్ డీవోపీగా పని చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్ కాగా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఇంకా పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఈ సినిమాకి పని చేస్తున్నారు.జూలై 26 వ తేదీన రాయన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను చాలా గ్రాండ్ గా విడుదల చేయనుంది.ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు.అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్. ఈ సినిమా A సర్టిఫికెట్ సినిమా కావడంతో ఒక్కసారిగా ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: