వారానికి 3 సార్లే..ప్రతి రోజంటే కష్టమే..అనసూయ హాట్‌ కామెంట్స్‌!

Veldandi Saikiran
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజులపాటు ఆ షోలో తన యాంకరింగ్ తో హవాను కొనసాగించింది. జబర్దస్త్ లోనే కాకుండా ఇంకా పలు రకాలు ఈవెంట్లు, షోలు వంటి కార్యక్రమాల్లో అనసూయ చురుగ్గా పాల్గొనేది. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే .....మరోవైపు సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంది ఈ భామ.

ఇక కొద్దిరోజుల పాటు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉండడంతో యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. ఇక అనసూయ పుష్పటు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతూ ఉంటుంది ఈ భామ. ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే అనసూయ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ లో అస్క్ మీ ఎనీథింగ్ అంటూ స్టోరీని పెట్టింది. ఇక ఈ స్టోరీని చూసిన చాలామంది నెటిజెన్స్ ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. వాటికి అనసూయ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ చేసింది. అందులో భాగంగా ఓ నెటిజెన్ మీరు ప్రతి రోజు జిమ్ చేస్తారా.... అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అనసూయ నాకు ప్రతిరోజు జిమ్ చేయాలని ఉంటుంది.

కానీ ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల నాకు అస్సలు సమయం కుదరడం లేదు. కనీసం వారానికి మూడుసార్లు అయినా కచ్చితంగా జిమ్ చేయడానికి ట్రై చేస్తా అని సమాధానమిచ్చింది. ఇక మరికొంతమంది నెటిజెన్లు పలు రకాలుగా ప్రశ్నలు అడగ్గా.... వాటికి అనసూయ చాలా క్రేజీగా సమాధానాలు చెప్పింది. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: