సీనియర్ హీరోయిన్ కి జలక్ ఇచ్చిన శ్రీ లీల.. ఏకంగా రెండో ఆఫర్లు కొట్టేసింది..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో శ్రీ లీల ప్రథమ స్థానంలో ఉంది. ఈమె పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె క్రేజ్ భారీగా పెరగడంతో కొంత మంది దర్శకులు వారు చిత్రీకరించే సినిమాలలో ఒక బ్యూటీ ని హీరోయిన్ గా అనుకొని కూడా ఆ తర్వాత శ్రీ లీలా వైపు సైడ్ అయినా సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి.

అందులో భాగంగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా స్టార్టింగ్ లో ఈ మూవీ లో పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోవాలి అని మూవీ బృందం వారు అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సినిమాలో పూజా హెగ్డే ను తీసేసి ఆ స్థానంలో శ్రీ లీలా ను తీసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయిన ఈ మూవీ ద్వారా శ్రీ లీలా క్రేజ్ మాత్రం భారీగానే పెరిగింది.

ఇకపోతే కొంత కాలం క్రితం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ స్టార్ట్ కాకముందు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉంది అని అనేక వార్తలు వచ్చాయి. ఇక చివరగా చూస్తే ఈ మూవీ బృందం ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలా ను ఎంపిక చేసుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన పూజా హెగ్డే ను అనుకున్నా రెండు సినిమాలలోకి శ్రీ లీలా ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోయిన్ల అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: