NBK 109 : ఇప్పటికీ ఆ విషయంలో నో క్లారిటీ.. ఇకనైనా అప్డేట్ ఇస్తారా.. లేదా..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న బాలకృష్ణ పోయిన సంవత్సరం వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించి రెండింటితో కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.

ఇక మొదట ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా ఒక హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈమె ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే ఇప్పటికీ కూడా ఊర్వసి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తుందా ..  లేదా అనేది క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో ఒక వేళ ఊర్వసి హీరోయిన్ గా నటిస్తే రెండవ హీరోయిన్ అప్డేట్ లేదు. ఒక వేళ ఊర్వశి కనుక ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుంటే ఏదైనా కీలక పాత్రలో నటిస్తే ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించే ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరు అనే దానిపై కూడా పెద్దగా క్లారిటీ లేదు.

మరి ఈ సినిమాల్లో హీరోయిన్ పాత్రల గురించి పెద్దగా క్లారిటీ రాకపోవడంతో బాలయ్య అభిమానులు ఈ మూవీ బృందం పై కాస్త గుర్రుగానే ఉన్నారు. ఇది ఇలా ఉంటే NBK 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: