లక్కీ బ్యూటీ సంయుక్తకి తెలుగులో నో ఆఫర్స్.. కారణం అదే..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఉన్న బ్యూటీలకు అవకాశాలు వరసగా వస్తూ ఉంటాయి. కానీ కొందరి విషయంలో మాత్రమే మంచి విజయాలు వచ్చిన క్రేజీ సినిమా అవకాశాలు దక్కవు. అలాంటి వారిలో సంయుక్తా మీనన్ కూడా ఒకరిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. మొదటగా ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ సినిమాలో ఈమె రానా కు భార్య పాత్రలో నటించింది. ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె బింబిసారా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె సార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటి విరూపాక్ష అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఇన్ని విజయాలు ఉన్న ఒక్క ఫ్లాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు లో భారీ సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు. ఇలా లక్కీ బ్యూటీ కి ప్రస్తుతం తెలుగు లో భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఏవి రావడం లేదు. ఇకపోతే కొంత మంది ఈమెకు అవకాశాలు రాక కాదు ... మంచి కథ కోసం ఏమి ఎదురు చూస్తున్నట్లు అందులో భాగంగా అనేక కథలను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: