ఎక్కడ తగ్గని హరీష్ శంకర్.. పవన్.. రవితేజతో అలాంటి ప్లాన్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగులో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత మిరపకాయ్ సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత నుండి ఈ దర్శకుడు ఫుల్ స్పీడ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కొంత కాలం క్రితం హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరో గా శ్రీ లీల హీరోయిన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని స్టార్ట్ చేశాడు.

ఈ మూవీ స్టార్ట్ అయిన కొంత కాలానికి పవన్ రాజకీయ పనులతో బిజీ కావడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. అలాగే పవన్ తిరిగి వచ్చే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి చాలా సమయం పట్టి అవకాశం ఉండడంతో హరీష్ శంకర్ ఆ గ్యాప్ లో ఓ మూవీ చేయొచ్చు అని డిసైడ్ అయ్యి రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చింది. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా మరో నెల నెలల్లో తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దానితో సెప్టెంబర్ చివరి వారం నుండి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి డేట్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పవన్ సెప్టెంబర్ చివరలో కనుక ఈ సినిమాకు తేదీలను ఇచ్చినట్లు అయితే ఈ సినిమా షూటింగ్ చక చగా పూర్తి అవుతుంది. అదే కానీ జరిగితే హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్ తో వెళ్లినట్లే అవుతుంది. మరి ఇప్పటికే పవన్ , హరీష్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బాస్టర్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: