ఆ సాంగ్ కోసం సంవత్సరం కష్టపడ్డ శంకర్.. ఆ సాంగ్ ఏదో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
దర్శకుడు శంకర్ సినిమాలలో పాటలు ఏ స్థాయిలో ఉంటాయో మన అందరికీ తెలిసిందే. ఈయన సినిమా తీయడానికి ఎంత కష్టపడతాడో పాటలను చిత్రీకరించడానికి అదే స్థాయిలో కష్టపడుతూ ఉంటాడు. అలాగే పాటల చిత్రీకరణ కోసం ఎన్నో కోట్లలో ఖర్చు పెట్టి భారీ ఎత్తున వాటిని చిత్రీకరిస్తూ ఉంటాడు. దానితో శంకర్ సినిమాలోని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అనే పేరు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది.

ఇకపోతే శంకర్ ఒక సినిమా పాట కోసం ఏకంగా సంవత్సరం పాటు కష్టపడ్డాడు. మరి ఆ సాంగ్ ఏది ..? ఎందుకు మరి సంవత్సరం పాటు ఆ పాట కోసం కష్టపడవలసి వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం శంకర్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా శ్రేయ హీరోయిన్ గా శివాజీ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో రజిని కాంత్ తో పెళ్లిని శ్రేయ ఇష్టం లేదు అని అంటుంది. దానికి కారణం రజనీ కాంత్ అడగగా ... రంగే ప్రధాన కారణం. నేను తెల్లగా ఉంటాను ... మీరు నల్లగా ఉంటారు.

అందుకే నాకు పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. దానితో రజినీ కాంత్ తెల్లగా మారడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఇక ఆ సమయంలో స్టైల్ అంటూ సాగే ఒక పాట వస్తుంది. ఇక ఈ పాటలో శ్రేయ కంటే రజనీ కాంత్ తెల్లగా కనిపిస్తాడు. ఇలా కనిపించడం కోసం చాలా అత్యాధునికమైన టెక్నాలజీని వాడవలసి వచ్చిందట. ఇక అందుకోసం అనేక ప్రయత్నాలు చేయడం వల్ల ఈ సాంగ్ కోసం ఏకంగా సంవత్సరం సమయం పట్టిందట. ఏదేమైనా తీరా ఈ సినిమా విడుదల అయ్యాక ఈ సాంగ్ వల్ల కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. అలా సంవత్సరం పాటు కష్టపడి ఈ సాంగ్ ను శంకర్ చిత్రీకరించాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: