సమంతను దారుణంగా అవమానించిన అక్కినేని కుటుంబం...?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. వచ్చి రాగానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ చిన్నది.... అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో మొదటి వరుసలో నిలిచింది. సమంత నటించిన మొదటి సినిమా అప్పట్లో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఆ సినిమా అనంతరం సమంత వరుసగా సినిమాలు చేసుకుంటూ..... ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. దాదాపు ఏడేళ్ల పాటు వీరి ప్రేమను రహస్యంగా కొనసాగించిన వీరిద్దరూ.... ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు  దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడిపారు. ఇక వివాహ అనంతరం సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించింది. నాగచైతన్య కూడా వివాహ అనంతరం సినిమాల్లో బిజీగా ఉండేవాడు.

ఇక ఏమైందో తెలియదు ఇద్దరూ కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఎవరికివారు బిజీగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఇటు సమంతకు, ఆటు నాగచైతన్యకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ వాటిని వీరిరువురు పెద్దగా పట్టించుకోరు. ఏది ఏమైనా పటికి వీరిద్దరూ కలుస్తారని ఆశ ఇన్ని రోజులు ప్రతి ఒక్కరిలో ఉండేది.

అలానే అక్కినేని కుటుంబంలో కూడా వీరు కలుస్తారని ఏదో ఒక చిన్న ఆశ ఉండేదట. ఆ ఆశతోనే సమంతకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు వారి ఇంట్లో అలానే దాచుకున్నారట. ఇక ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలవరని తెలుసుకొని అక్కినేని ఇంట్లో సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలను వారి స్టోర్ రూమ్ నుంచి తీసేసారని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ వీరు కలిస్తే బాగుంటుందని..... సమంత, నాగచైతన్య అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వీరు కలవరని అంతా ఫిక్స్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: