కంగువ కూడా రెండు భాగాలేనా..?

shami
సూర్య హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కంగువ. ఈ సినిమా ను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సినిమాను దాదాపు 200 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తుంది. ఈ ఇయర్ దీపావళి సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లో సూర్య డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. సూర్య కంగువ పీరియాడికల్ కథ తో వస్తుంది. సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా కంగువ తప్పకుండా ఆ అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అంటున్నారు.
ఐతే ప్రస్తుతం కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అయిన ప్రతి సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయడం కామన్ గా మారింది. అందులో భాగంగానే కంగువ సినిమా ను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. దాదాపు కంగువ కూడా రెండు పార్టులుగా రిలీజ్ పక్కా అని తెలుస్తుంది. ఐతే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ బయటకు చెప్పట్లేదు.
సూర్య కంగువ పార్ట్ 1 క్లైమాక్స్ లో పార్ట్ 2 ఉంటుందని క్లూ ఇస్తారట. కచ్చితంగా సూర్య అన్ని సినిమాలు ఒక లెక్క ఈ సినిమా మరో లెక్క అనిపించేలా చేస్తుందని అంటున్నారు. సూర్య మార్క్ మూవీగా కంగువ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని తెలుస్తుంది. మరి సూర్య కంగువ అంచనాలకు తగినట్టు గానే ఉంటుందా లేదా అన్నది చూడాలి. సూర్య కంగువ సినిమా లో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు. సూర్య సినిమాను తెలుగులో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు లో సూర్యకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారని తెలిసిందే. అందుకే సూర్య కంగువకు ఇక్కడ కూడా సూపర్ హైప్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: