కల్కి విషయంలో అదొక్కటే తేడా కొట్టిందా..?

murali krishna
తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచే ఆ తరహా సినిమాలు రూపొందుతోన్నాయి. ఇలా ఇప్పటికే అతడు పలు సినిమాలతో వచ్చి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతడు నటించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమా బాలీవుడ్ తాజాగా ఓ సంచలన రికార్డును నమోదు చేసుకుంది.బడా స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.
అయితే ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్‌ టాక్‌, బజ్‌ను బట్టి ఈ సినిమా కలెక్షన్లు సునాయసంగా 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేశారు. సినిమా రిలిజై దాదాపు రెండు వారాలు దాటింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 840 కోట్ల గ్రాస్‌కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసిందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో నైజాంలో 120 కోట్లు, 130 కోట్లు ఏపీలో వసూలు చేసింది.
అయితే ‘కల్కి 2898AD' సినిమాకు వచ్చిన బజ్‌, పాజిటివ్‌ టాక్‌, రివ్యూలను బట్టి చూస్తే ఈ చిత్రం ఇంతకంటే ఎక్కువే వసూలు చేయాల్సిందని కొంత మంది అంటున్నారు. దీనికి ముఖ్యకారణం టిక్కెట్ల రేట్లు పెంచడమే అని అంటున్నారు. మల్టీప్లైక్స్‌లో ఈ చిత్రం టిక్కెట్‌ రేటు 400 రూపాయల నుండి 500 వరకు వుండటంతో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు అంతగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. కనీసం రెండో వారంలోనైనా టిక్కెట్ల ధర తగ్గించి వుంటే.. ఖచ్చితంగా కలెక్షన్లు మరింత పెరిగేవి అని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి.టిక్కెట్ల ధర తమకు అందుబాటులో లేకపోవడంతో మిడిల్‌క్లాస్‌ ఆడియన్స్‌ ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని థియేటర్లకు వైపు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. కానీ ‘కల్కి 2898AD' సినిమాను థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా.. ఇలాంటి సినిమాను కూడా టిక్కెట్ల రేట్ల వల్ల ఆడియన్స్‌ చూడలేకపోవడం కాస్త ఇబ్బందికరమే. సో.. ‘కల్కి 2898AD' సినిమా వసూళ్లకు టిక్కెట్ల ధర పెంపుదల ఎంత అడ్వాంటేజీ అయ్యిందో.. అంతే మైనస్‌ అయ్యిందని కొంత మంది కామెంట్స్‌ చేస్తున్నారు.10 రోజులు మాత్రమే టికెట్ ధర పెంచాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కల్కి సినిమాకి 14 రోజులు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: