చిన్నారిపై బూతులు! ప్రణీత్ హనుమంతు బ్యాచ్ కి ఎన్నేళ్లు శిక్ష పడుతుందంటే?

Purushottham Vinay

ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఒక వీడియో మీద ప్రస్తుతం దేశావ్యాప్తంగా భారీ వ్యతిరేకత వస్తుంది. నిజానికి ఒక తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధాన్ని చాలా దారుణాతి దారుణంగా మానవత్వం లేకుండా అవహేళన చేస్తూ, అసభ్యంగా వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ వెకిలి నవ్వు నవ్వుతూ ప్రతి ఒక్క తండ్రి కోపానికి గురయ్యారు ప్రణీత్ హనుమంతు ఇంకా వాడి బ్యాచ్. ముఖ్యంగా ఈ బ్యాచ్ లో నల్ల చొక్క వేసుకున్న ఆది అనేవాడు చాలా దారుణాతి దారుణంగా అత్యంత నీచంగా రాయడానికి వీలు లేని విధంగా బూతులు ఆ పసి పాప, తండ్రి గురించి పచ్చి బూతులు మాట్లాడాడు.ఇక ఆ వీడియోలో కనిపించిన ఆ నలుగురు పోరంబోకులు మీద  తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి సైతం సంభందిత అధికారులకు తెలియజేశారు. ఇక మొదటగా ఈ ఇష్యూ ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళింది మాత్రం యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ అనే చెప్పాలి. డార్క్ కామెడీ రూపంలో వికలాంగుల పైన, చిన్న పిల్లల పైన ఏది పడితే అది మాట్లాడుతూ, ఎవరిని పడితే వారిని దూషిస్తూ వీడియోలు చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళను తప్పకుండా శిక్షించాలి అంటూ సామాన్య మానవులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి చేయడానికి భవిష్యత్తులో భయపడతారు.


ఇప్పటికే సమాజంలో చిన్న పిల్లల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే వీళ్లు వాటిని ఎంకరేజ్ చేసినట్టుగా వీడియోలు చేయడం మాత్రం ఏమాత్రం సరైన విషయం కాదు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని అయితే తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ వీడియోలో ఉన్న నలుగురు వెధవల్లో హనుమంతుని పక్కన  డల్లాస్ నాగేశ్వరరావు అనే వాడు రీసెంట్ గా తను నేను ఏ తప్పు చేయలేదు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. నిజానికి నేను ఆ వీడియోలో ఒక మాట కూడా అనలేదు.సరే నేను ఒక్క మాట కూడా అనలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు అని చెప్పడం లేదు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆపకపోవడం, అక్కడి నుంచి బయటికి వెళ్లకపోవడం నేను చేసిన తప్పు అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నాకు చాలా భయమేస్తుంది అంటూ రీసెంట్ గా తను ఒక వీడియో ను పోస్ట్ చేశాడు. అయితే వాళ్ళు అలా పచ్చి బూతులు మాట్లాడుతుంటే వీడు ఆ బూతులని ఎంజాయ్ చేస్తూ నవ్వుకున్నాడనేది వాస్తవం. ఇక వీళ్ళకి శిక్ష పడితే 5 లక్షల జరిమానా విధించి 3 నుంచి 10 ఏళ్ల పాటు జైల్లో ఉంచుతారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: