బాలీవుడ్ బాధితులు వీరే.. ఇక్కడ హిట్ అక్కడ ఫట్..?

Pulgam Srinivas
తెలుగు మార్కెట్ తో పోలిస్తే బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది. దానితో ఎంతో మంది తెలుగు దర్శకులు బాలీవుడ్ లో మంచి విజయాలను అందుకొని అక్కడ ఫుల్ క్రేజీ ను సంపాదించుకోవాలి అనుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు లో మంచి విజయాలను సాధించిన సినిమాలను హిందీ లో రీమిక్ చేసి కొంత మంది దర్శకులు అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నారు వారు ఎవరు అనేది తెలుసుకుందాం.
కొంత కాలం క్రితం నాని హీరో గా శ్రద్ధ శ్రీ నాథ్ హీరోయిన్ గా రూపొందిన జెర్సీ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాను గౌతమ్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇక తెలుగులో మంచి విజయం సాధించిన ఈ మూవీ ని హిందీ లో షాహిద్ కపూర్ హీరో గా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా గౌతమ్ రీమేక్ చేశాడు. కానీ ఈ మూవీ హిందీ ప్రేక్షకులను అలరించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీ తో గౌతమ్ కు బాలీవుడ్ లో నిరాశనే మిగిలింది.

టాలీవుడ్ యువ దర్శకుడు శైలేష్ కొలను కొంత కాలం క్రితం హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ ని తెలుగులో రూపొందించాడు. విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ని హిందీ లో హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ తో ఈ దర్శకుడు రీమిక్ చేశాడు. కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న స్థాయిలో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ ద్వారా శైలేష్ కి కూడా హిందీ లో పెద్దగా గుర్తింపు ఏమీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: