మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ అదిరిపోయిందిగా..

murali krishna
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న కిక్కాస్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. మాస్ మహారాజా, మాస్ మేకర్ మాస్ రీయూనియన్ మునుపెన్నడూ లేని ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా రిలీజైన షోరీల్ వీడియో మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘మిస్టర్ బచ్చన్’  మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘సితార్’ సాంగ్ ఇవాళ విడుదల చేశారు. . స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా కోసం అదిరిపోయే ఆల్బం కంపోజ్ చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.'మిస్టర్ బచ్చన్' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ 'సితార్'ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ మాంచి మెలోడియస్ ట్యూన్ ఇవ్వగా... సాకేత్ కోమండూరి, సమీరా భరద్వాజ్ అంతే అందంగా పాడారు. ఈ పాటను లిరిసిస్ట్ సాహితి రాశారు.'సితార్' పాట ఎంత వినసొంపుగా ఉందో... ఆ పాటలో రవితేజ, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ అంత కంటే ఎక్కువ అందంగా ఉంది. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో విదేశాల్లో అందమైన లోకేషన్లలో పాటను తెరకెక్కించారు. హీరో హీరోయిన్లు వేసిన స్టెప్పుల్లో రొమాన్స్, హుషారు కనిపించాయి. రవితేజ యంగ్ లుక్ అదిరిందంతే!హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక...' పాటతో పాటు 'దువ్వాడ జగన్నాథం - డీజే' సినిమాలో 'అస్మైక యోగ...' పాటను సైతం సాహితి రాశారు. మరోసారి వీళ్లిద్దరి కలయికలో 'సితార్' హిట్ సాంగ్ అని చెప్పాలి.మాస్ మహారాజా రవితేజ రాంపేజ్ అదుర్స్ అన్నారంతా! ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే... ఆ విషయాన్ని దర్శక నిర్మాతలు గానీ, చిత్ర బృందంలోని సభ్యులు గానీ అధికారికంగా చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: