కల్కి 2 కమల్ నెక్స్ట్ లెవెల్ అంతే..!

shami
ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరు నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కూడా సినిమాలో భాగం అవ్వడం సినిమా సక్సెస్ ని ఈజీ చేశారు. ఐతే వారికున్న ఇమేజ్ ని నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ గా వాడుకున్నాడని చెప్పొచ్చు. ఇక ఇదిలాఉంటే కల్కి సినిమాలో కమల్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్ర అదిరిపోయింది. తన ప్రతి సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించే కమల్ యాక్సిన్ పాత్రలో అదరగొట్టారు.
కల్కి 1 లో కమల్ సీన్స్ కాస్త తక్కువ అనిపించినా కల్కి 2లో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. కల్కి 1 లో అమితాబ్ వర్సెస్ ప్రభాస్ కాగా సెకండ్ పార్ట్ లో వీరిద్దరు కలిసి కమల్ తో యుద్ధం చేస్తారని తెలుస్తుంది. కల్కి సినిమా ఎలాంటి అంచనాలతో తెరకెక్కించారో దానికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంది.
కల్కి 2 సినిమా విషయంలో నాగ్ అశ్విన్ మరింత శ్రద్ధగా పార్ట్ 1 కంటే భారీగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. కల్కి 2 ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి కాగా అది కూడా పూర్తి చేసి కల్కి 2 ని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి కల్కి 1 సృష్టిస్తున్న సంచలనాలే ఒక రేంజ్ లో ఉండగా కల్కి 2 ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. కల్కి తో అలరించిన కమల్ హాసన్ ఈ వీకెండ్ ఇండియన్ 2 సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో కూడా కమల్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ డైరెక్షన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 వస్తుంది. ఐతే ఇండియన్ 2 మాత్రమే కాదు ఇండియన్ 3 ని కూడా పూర్తి చేశాడు శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: