తెలుగు పై మనసు పారేసుకున్న తమిళ హీరోలు వీరే.. వరుసగా టాలీవుడ్ సినిమాలు..!

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్య కాలంలో కొంత మంది ఇతర భాష హీరోలు తెలుగు సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక వారు నటించిన స్టేట్ తెలుగు సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో మరికొన్ని తెలుగు సినిమాలకు కూడా వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో ఎక్కువ నటించడానికి ఆసక్తి చూపుతున్న హీరోలు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు. మొదటగా ఈయన మహానటి అనే తెలుగు సినిమాలలో నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సీత రామం అనే తెలుగు సినిమాలో ఈ నటుడు హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ నటుడు లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నాడు.

అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరో తెలుగు సినిమాకు కూడా ఈ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ నటుడు ధనుష్ కూడా తెలుగులో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు తెలుగు దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే తెలుగు సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర అనే తెలుగు సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇలా ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుసగా తెలుగు సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: