అమితాబ్ : వారితో కలసి కల్కి సినిమా చూడాలని వుంది..?

murali krishna
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ ఆడియెన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొమ్మిది వందల కోట్ల వసూళ్లతో థౌజండ్ బాక్సాఫీస్ మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. అయితే ఈ సినిమాలో హీరో ప్రభాసే అయినప్పటికీ ఆడియెన్స్ అందరి దృష్టిని మరింత ఎక్కువగా ఆకర్షించింది అశ్వద్ధామ క్యారెక్టరే. ఇందులో అమితాబ్ బచ్చన్ నటించారు. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అందుకే కల్కి 2898 ఏడి విజయాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్న వారిలో ముందుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరే చెప్పాలి. సినిమాలో ఆయనకు దొరికిన స్క్రీన్ స్పేస్, ఎలివేషన్లు మరే ఇతర పాత్రకు దక్కలేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ప్రభాస్నే డామినేట్ చేసే స్థాయిలో చెలరేగిపోయారు.ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్, అమితాబ్ బచ్చన్ కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అమితాబ్ చేసిన వ్యాఖ్యలు కల్కి ఆడియెన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి.కల్కి 2898 ఏడీపై వస్తున్న ప్రశంసలు నావి కాదు. అందులోని నా పాత్రకు, ఆ సినిమా కాన్సెప్ట్‌కు వస్తున్నాయి" అని అన్నారు అమితాబ్.
అలాగే అసలు కల్కి 2898 ఏడీ టైటిల్ అర్థం ఏంటని, తనకు అర్థం కావడం లేదని దర్శకుడు అశ్విన్ను అడిగారు బిగ్బీ. దీనికి అశ్విన్ బదులిస్తూ ఇది మహాభారతంలో జరిగే చివరి ఘట్టం అని స్పష్టత ఇచ్చారు. "నువ్వు అసలు దీపికా పదుకొణె పాత్ర గురించి ఎలా ఆలోచించావు, ఆ ఐడియా నీకు ఎలా వచ్చింది" అని సుమతి పాత్రను ఉద్దేశించి అడిగారు అమితాబ్.
దీపికా పదుకొనె నిప్పుల్లో నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు. అలానే హైదరాబాద్‌లో తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమా చూడాలని ఉంది, ఎందుకంటే ఈ చిత్రాన్ని చూసి వాళ్లు ఫిదా అయిపోయి ఉంటారు అని బిగ్ బీ తన కోరికను బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వీడియో త్వరలోనే రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: